రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే (Indian Railways ) శుభావార్త తెలిపింది. ట్రైన్ టికెట్ బుక్ చేయడాన్ని ( Online Ticket Booking) మరింత సులభంగా ఆహ్లాదకరంగా మార్చనున్నట్టు సమాచారం అందించింది. భారతీయ రైల్వేకు చెందిన IRCTC వెబ్ సైట్ ను అధునీకరించనున్నట్టు రైల్వే తెలిసింది. గతంలో 2018లో వెబ్ సైట్ ను అప్ గ్రేడ్ చేయగా మళ్లీ ఈ సారి కీలక మార్పులు చేయనున్నట్టు తెలిపింది.
Cargo Express Trains: సౌత్ సెంట్రల్ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారి కార్గో ఎక్స్ ప్రెస్ ( Cargo Express Trains ) ట్రైన్లను నడపాలని నిర్ణయించుకుంది. ఈ కార్గో రైళ్లు ఆగస్టు 5వ తేది నుంచి సుమారు ఆరు నెలల పాటు నడపనుంది.
హైదరాబాద్: రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఇతరుల నుంచి డబ్బు వసూలు చేసి మోసాలకు ( Cheating ) పాల్పడుతోన్న ఇద్దరు యువకులను ఇవాళ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
భారతీయ రైల్వే ( Indian Railway) కీలకమార్పులు చేస్తోంది. జీరో బేస్డ్ టైమ్ టేబుల్ (zero based time table) వ్యవస్థకు శ్రీకారం చుడుతోంది. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ కొత్త వ్యవస్థ ప్రకారం ఇకపై ఆ రైల్వే స్టేషన్లలో హాల్ట్ ( Railway station halts) లకు ఇండియన్ రైల్వే స్వస్తి పలకనుంది. ఈ మార్పుతో దూర ప్రాంత ప్రయాణాల్లో గణనీయంగా సమయం తగ్గనుంది.
IRCTC ∣ ఐఆర్సీటిసిలో అందుబాటులో ఉన్న ఈ ఆప్షన్ గురించి చాలా మందికి తెలియదు. ఈ చిట్కాలను పాటించి రైల్వే టికెట్లను ఒకే ఒక్క ఫోన్ కాల్ తో రద్దు చేసుకుని రీఫండ్ పొందవచ్చు.
IRCTC QUIZ: భారతీయ రైల్వే ప్రయాణికులను ( IRCTC ) ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. చాలా మంది దీనికి సరైన సమాధానం చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి. లాక్డౌన్ సమయంలో భారతీయ రైల్వే ప్రయాణికులకు సూచనలు చేయడంతో పాటు వారికి ఎప్పటికప్పుడు ప్రయాణానికి సంబంధించిన తాజా సమాచారాన్ని షేర్ చేస్తోంది.
COVID-19 surveillance cameras: భారతీయ రైల్వే శాఖ కోవిడ్-19 నిఘా కెమెరాల్ని స్టేషన్లలో ఇన్స్టాల్ చేయబోతోంది. ఈ నిఘా కెమెరాల ప్రత్యేకతలు వింటే ఆశ్చర్యపోతారు. రద్దీ ప్రదేశాల్లో కూడా ఇకపై కోవిడ్-19 రోగి తప్పించుకోలేడు. నిజమా ? అవును మరి!! అందుకే ఇండియన్ రైల్వే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాల్ని ( Artificial Intelligence ) భారీగా కొనుగోలు చేస్తోంది
Indian Railways cancelled trains: ఇండియన్ రైల్వే మరోసారి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. రెగ్యులర్ రైళ్లు, మెయిల్, ఎక్స్‌ప్రెస్, సబ్ అర్బన్ రైళ్లను రద్దు ( Trains cancelled ) చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని రైళ్లకు మాత్రం దీన్నించి మినహాయింపునిచ్చింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా సంక్రమణ ( coronavirus spread ) నేపథ్యంలో భారతీయ రైల్వే మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రైలు ప్రయాణం రద్దయిన ప్రయాణికులకు ఊరట కలిగించేలా భారతీయ రైల్వే ఓ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14 లేదా ఆ తర్వాత రైళ్లలో ప్రయాణించేందుకు టికెట్లను కొనుగోలు
Cancelled tickets money: ఇండియన్ రైల్వే మార్చి 21 నుంచి 31 మధ్య రద్దు చేసిన ప్రయాణికుల అన్ని టికెట్స్‌కి నగదును తిరిగి సదరు రైలు ప్రయాణికులకు చెల్లించింది. ఆన్లైన్లో ఐఆర్సిటిసి ఎకౌంట్ ( IRCTC account ) ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ రద్దు చేసిన టికెట్స్ మొత్తానికి అయిన నగదును వారి వారి ఖాతాల్లో జమ చేసింది.
వలసకూలీలకు ( Migrant workers ) ఇండియన్ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకూలీలను శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్స్ ( shramik special trains ) ద్వారా వారి స్వస్థలాలకు చేరవేయడంలో నిరంతరంగా సేవలు అందిస్తున్న ఇండియన్ రైల్వే ( Indian Railways ).. తాజాగా మరో ప్రకటన చేసింది.
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus ) నివారణకు కేంద్రం లాక్ డౌన్ ( Lockdown ) విధించిన నేపథ్యంలో దేశం నలుమూలలా చిక్కుకుపోయిన వలసకూలీలను ( Migrant workers ) తరలించేందుకు కేంద్రం శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్స్ ( Shramik special trains ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
సోషల్ డిస్టన్సింగ్... కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు ఔషదం కంటే అతి ముఖ్యమైనది. ఇక మన జీవితాల్లో ఒక భాగం కావాల్సింది. కానీ కారణాలేవైనా అక్కడక్కడా ఆ సోషల్ డిస్టన్సింగ్ ( Social distancing ) అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. అటువంటి దృశ్యమే ఒకటి తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో ( Coimbatore in TamilNadu) కనిపించింది.
రైలు సేవల పునరుద్ధరణతో ఇండియన్ రైల్వే ( Indian Railways ) మే 11 నుంచి టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియన్ రైల్వే ఐఆర్సిటిసి ( IRCTC ) ద్వారా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి టికెట్ బుకింగ్ చేపడుతోందనే విషయం తెలియడంతో దేశం నలుమూలలా కొన్ని కోట్ల మంది ప్రయాణికులు రైలు టికెట్స్ కోసం పోటీపడ్డారు.
లాక్ డౌన్ ( Lockdown ) మే 17వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ( PM Modi`s video conference ) ద్వారా సమావేశమై ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రాల్లో నెలకొన్ని పరిస్థితులు, చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ కొనసాగింపుపైనా ( Lockdown extension ) ప్రధాని మోదీ ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
లాక్ డౌన్ నిబంధనలు కొంత సడలించినప్పటికీ.. బస్సు సర్వీసులు అందుబాటులో లేకపోవడం స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వాళ్లకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా సొంత వాహన సదుపాయం లేనివాళ్లకు బస్సు సర్వీసులే ఆధారం కావడంతో బస్సులు మళ్లీ ఎప్పుడూ రోడ్డెక్కుతాయా అని ఎదురుచూస్తున్న వాళ్లే అధికం.
కరోనా వైరస్ వ్యాప్తి (Coronavirus spread) నివారణకు లాక్ డౌన్ (Lockdown) చేపట్టిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయానికి భారీగా గండిపడిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన వాటిలో ఇండియన్ రైల్వే సేవలు (Indian Railways services) కూడా ఒకటి.
'కరోనా వైరస్' కారణంగా ..దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 3 వేల 700 రైళ్లు రద్దు చేశారు. ఏకంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయడం ఇదే తొలిసారి. దీంతో రైల్వే కోచ్ లు మొత్తం ఎక్కడిక్కడే నిలిచిపోయాయి.
కరోనావైరస్ (COVID-19) దాడి తీవ్రరూపం దాలిస్తే.. ఆ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో మరిన్ని క్వారంటైన్ సేవలు (Quarantine) అందించేందుకు 20,000 రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా తీర్చిదిద్దాలని భారతీయ రైల్వే (Indian Railways) నిర్ణయించుకుంది.
కోవిడ్-19 పాజిటివ్‌తో (COVID-19 positive) బాధపడుతున్న పలువురు రైళ్లలో ప్రయాణిస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. రైలులో ప్రయాణించిన వారికి కరోనావైరస్ ఉందని తెలిసిన అనంతరం రైల్వే శాఖ ట్విటర్ (Indian Railways twitter) ద్వారా రైలు ప్రయాణికులకు (Train passengers) ఓ విజ్ఞప్తి చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.