Telugu Big Boss 4: Big Boss 3 షోను విజయవంతంగా నడిపించిన నాగార్జున ( Nagarjuna ) నాలుగో సీజన్‌ను కూడా హోస్ట్ చేస్తున్నాడు. కానీ కొన్ని కండిషన్స్ కూడా పెట్టాడట కింగ్ నాగార్జున.
Bigg Boss 4 Contestants | తొలి సీజన్ బిగ్‌బాస్ 1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించి సక్సెస్ అయ్యాడు. తనలో కొత్త వెరియేషన్ ఎలా ఉంటుందో చూపించాడు. బిగ్‌బాస్ 2లో నాని హోస్ట్‌గా చేయగా, చివర్లో కౌశల్ మండా వీరాభిమానులు సీజన్‌ను పీక్కు తీసుకెళ్ల కాస్త కన్ఫ్యూజ్ చేశారు. మూడో సీజన్‌ను కింగ్ నాగార్జున బాగా హ్యాండిల్ చేశారు.
Tollywood celebrities | అమరావతి: ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా కోరుతూ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తదితరులు మంగళవారం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని ( AP CM YS Jagan) కలిసిన సంగతి తెలిసిందే. అయితే, సినీ పెద్దలతో సమన్వయం చేయాల్సిందిగా సూచిస్తూ సీఎం జగన్ ఆ బాధ్యతను మంత్రి పేర్ని నానికి ( Minister Perni Nani) అప్పగించారు.
Tollywood celebrities | చిరంజీవి, నాగార్జున, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఇతర టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని ( AP CM YS Jagan) కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయిన సినీ ప్రముఖులు.. ఏపీ సర్కారు నుంచి సినీ పరిశ్రమకు అవసరమైన సహాయసహకారాల గురించి చర్చించారు.
సినీ పరిశ్రమనే నమ్ముకున్న వారికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR ) గుడ్ న్యూస్ చెప్పారు. లాక్ డౌన్ ( Lockdown ) కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ పనులను దశల వారీగా పునరుద్ధరిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అయితే, లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్-19 వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు.
ఏప్రిల్ 5న ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ ఆఫ్ చేసి కొవ్వొత్తులు, దీపాలు, లేదా మొబైల్ ఫ్లాష్, టార్చ్ లైట్స్ వెలిగించి కరోనాపై యుద్ధానికి మద్దతు తెలపాల్సిందిగా మన దేశ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
హిందీ చిత్ర పరిశ్రమలో కూడా తెలుగు నటులు చాలామంది తమ లక్ పరీక్షించుకున్నారు. తెలుగు హీరోలు నటించిన పలు హిందీ చిత్రాలు అక్కడ కూడా సూపర్ హిట్ అవ్వగా.. పలు సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి.
క్యాన్సర్ తో బాధపడున్న సోనాలీ బింద్రేకు పరామర్శల వెల్లువ కురుస్తోంది.. సినీ ప్రముఖలతో పాటు లక్షలాది మంది అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున ఆమెకు ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలి డియర్ అంటూ మెజేస్ పంపారు. సోనాలీ 'నీవు తొందరగా కోలుకోవాలి. క్యాన్సర్ ను జయించాలన్ననీ గొప్ప సంకల్పానికి బలం చేకూరాలని కోరుకుంటున్నా డియర్' అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. దీనికి సమాధానంగా 'థ్యాంక్స్ నాగ్' అంటూ సోనాలీ రిప్లై ఇచ్చింది. సూపర్ హిట్ మూవీ మన్మథుడులో నాగ్ సరసన సోనాలీ బింద్రే నటించిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.