తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇదివరకు తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసుల సంఖ్యలో తాజాగా స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. తెలంగాణలో నేడు కొత్తగా మరో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనావైరస్ కాటుకు మరొకరు బలయ్యారు. విజయనగరం జిల్లా ( Vizianagaram district ) బలిజపేట మండలం చిలకలపల్లికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు కరోనాతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర అనారోగ్యం పాలైన వృద్ధురాలు విశాఖలోని విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో డయాలసిస్ ( Dialysis VIMS ) చికిత్స తీసుకుంటున్నారు.
కరోనా వైరస్‌కి కులం, మతం, ప్రాంతం, వర్ణం ఏదీ ఉండదనే యావత్ ప్రపంచం భావిస్తోంది.. దానినే నిజమని విశ్వసిస్తోంది. కానీ యూకే, యూఎస్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అక్కడ శ్వేత జాతీయుల కంటే నల్ల జాతీయులకే కరోనా వైరస్ రిస్క్ అదనంగా ఉందని యూకే, యూఎస్‌లలో జరిపిన వేర్వేరు అధ్యయనాల్లో తేలింది.
తెలంగాణలో నేడు కొత్తగా మరో 10 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,132 కి చేరింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 29 మంది మృతి చెందారు.
తెలంగాణలో సోమవారం కొత్తగా మరో 3 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనివేనని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1085కు చేరింది.
లాక్డౌన్ల కారణంగా విమానాల రాకపోకలు రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పటికే చాలామంది భారతీయులు విదేశాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అలా విదేశాల్లో చిక్కుకుని స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్న భారతీయులను మే 7 తర్వాత నుంచి దేశానికి రప్పించేందుకు కేంద్రం తగిన ఏర్పాట్లు చేస్తోంది.
రాజస్థాన్ రాష్ట్రంలో క్వారంటైన్ లో ఉన్న ఓ మహిళను ముగ్గురు దుండగులు లైంగికదాడి చేశారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాక్ డౌన్ కారణంగా ఓ మహిళ
శ్రీరాముని అనుగ్రహము ప్రజలందరిపై ఉండాలని... అంతా శుభం కలగాలని మంత్రి హరీష్ రావు ఆ భగవంతుడిని కోరుకున్నారు. ప్రభుత్వం చెప్పే సూచనలు పాటిస్తూ కరోనా మహమ్మారిని పారదోలుదామని మంత్రి హరీష్ రావు స్పష్టంచేశారు.
కరోనావైరస్ (COVID-19) దాడి తీవ్రరూపం దాలిస్తే.. ఆ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో మరిన్ని క్వారంటైన్ సేవలు (Quarantine) అందించేందుకు 20,000 రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా తీర్చిదిద్దాలని భారతీయ రైల్వే (Indian Railways) నిర్ణయించుకుంది.
కరోనావైరస్ (COVID-19) ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో నగరంలోని కాలనీలు, అపార్ట్మెంట్ అసోసియేషన్స్‌కి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (Telangana DGP Mahender Reddy) ఓ విజ్ఞప్తి చేశారు.
కరోనావైరస్ వ్యాప్తిని (Coronavirus spread) కట్టడి చేసేందుకు యావత్ దేశం లాక్డౌన్ (Lockdown) పాటిస్తుండటంతో నిత్యం రకరకాల పనులతో బిజీగా ఉండే క్రీడాకారులు, సినిమా సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితమయ్యారు (Celebrities in quarantine).
కరోనావైరస్ పాజిటివ్ కేసులు (Coronavirus positive cases), దేశంలో మృతుల సంఖ్య (Death toll) పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) రాష్ట్ర ప్రజలందరికీ ఓ విజ్ఞప్తిచేశారు.
కరోనావైరస్కి (Coronavirus) వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటంలో రానున్న రెండు వారాలు చాలా కీలకమైనవి అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ (Union health minister Harshavardhan) అన్నారు.
కరోనా వైరస్ (Coronavirus) ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తున్న తరుణంలో ఒకరి నుండి మరొకరు సోషల్ డిస్టన్సింగ్ (Social distancing) మెయింటేన్ చేయాల్సిందిగా కేంద్రం పిలుపునిచ్చింది. అలాగే జనం ఎక్కడా గుంపులు గుంపులుగా ఉండకూడదని.. సమూహాలుగా తిరిగే చోట వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు (WHO experts) సైతం విజ్ఞప్తిచేస్తున్నారు.
విదేశాల నుండి వచ్చిన వారి నుండి కరోనావైరస్ (Coronavirus) వ్యాపిస్తున్న కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లొచ్చిన వారిని (Foreign travel hostory) అధికారులు ఎక్కడికక్కడే క్వారంటైన్ హోమ్స్‌కి (Quarantine homes) తరలిస్తున్న సంగతి తెలిసిందే.
కరోనావైరస్ను అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా నిత్యం ఏదో ఓ బిజీ షెడ్యూల్‌తో బిజీబిజీగా ఉండే సెలబ్రిటీలు ఈ లాక్డౌన్ సమయాన్ని తమకు తోచినట్టుగా సరదాగా గడుపుతున్నారు.
చైనా దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్, ఇప్పుడు భారత్ ను భయపెడుతోంది. చైనాలోని వుహాన్ నగరం నుండి కేరళకు వచ్చిన ఒక విద్యార్థినికి పరీక్షలు చేయగా పాజిటివ్ తేలిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో భారతదేశం కరోనావైరస్ కు సంబంధించిన మొదటి కేసును గురువారం కేరళ రాష్ట్రంలో గుర్తించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.