అమరావతి: ఏపీలో మంగళవారం నాటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 252 బ్లాక్ ఫంగస్ కేసులు (Black fungus cases in ap) నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. ఎప్పటికప్పుడు అన్ని జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నామని, బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ కోసం అవసరమైన ఇంజక్షన్లు సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నామని అనిల్ సింఘాల్ వెల్లడించారు.
Remdesivir Injections: ఏపీలో కరోనా పరిస్థితులు కొలిక్కి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుుడు పరిస్థితిని సమీక్షిస్తూ నియంత్రిస్తుండటంతో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ విధమైన కొరత లేదంటోంది ప్రభుత్వం.
Cowin Portal: కరోనా సంక్రమణ నేపధ్యంలో ఆరోగ్య సేతు యాప్..వ్యాక్సినేషన్ నేపధ్యంలో కోవిన్ పోర్టల్. ప్రజలకు చాలా చేరువయ్యాయి. ఇకపై కోవిన్ పోర్టల్ 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో రానుంది. మరోవైపు కోవిడ్ వేరియంట్ల గుర్తింపు కోసం 17 లేబొరేటరీలు ఏర్పాటు కానున్నాయి.
Remdesivir injections: కరోనా చికిత్సలో ఇప్పుడు ప్రదానంగా విన్పిస్తున్న మందు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్. దేశంలో కరోనా ఉధృతి నేపధ్యంలో ఏర్పడ్డ రెమ్‌డెసివిర్ కొరత త్వరలో దూరం కానుంది. ఏపీ కేంద్రంగా ఇంజక్షన్ తయారీ కానుంది.
Telangana CM KCR about lockdown in Telangana state: హైదరాబాద్: తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించే విషయంలో గత అనుభవాలతో పాటు ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. అంతకంటే ముందుగా ప్రధాని మోదీతో మాట్లాడిన సీఎం కేసీఆర్... రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు (remdesivir injections), ఆక్సీజన్ సప్లై (Oxygen supply) విషయంలోనే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
Virafin medicine: కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ కరోనా చికిత్సకు మరో ప్రత్యామ్నాయ మందు అందుబాటులో వచ్చింది. అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది.
Telangana: తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రతిరోజూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఓ వైపు కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా..సంక్రమణ మాత్రం ఆగడం లేదు.
Remdesivir Injections: ఆక్సిజన్ సరఫరా, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం రేగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పిస్తున్నారు.
Remdesivir Demand: కరోనా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో అందించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల బ్లాక్ మార్కెట్ దందా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏపీలోని విశాఖనగరం రెమ్‌డెసివిర్ బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డాగా మారింది. అటు ముంబైలో కూడా భారీగా రెమ్‌డెసివిర్ వయల్స్ పట్టుబడ్డాయి.
Remdesivir Injections: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఆక్సిజన్ సిలెండర్ల కొరత మరోవైపు కీలకమైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత వేధిస్తోంది. ఈ నేపధ్యంలో ఓ ఫార్మా కంపెనీ నుంచి 60 వేల రెమ్‌డెసివిర్ వయల్స్ విదేశాలకు తరలించడం అనుమానాలకు తావిస్తోంది.
Oxygen Supply: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మరోవైపు తెలంగాణలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. ప్రత్యామ్నయంగా ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్నించి అవసరమైన లిక్విడ్ ఆక్సిజన్ రప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
కరోనా మెడిసిన్ (CoronaVirus Medicine) ‘రెమ్‌డెసివర్’ (Remdesivir Injection) మార్కెట్లోకి వచ్చింది. హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో మాత్రమే విక్రయిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.