Indian Cricket: ఇండియన్ క్రికెట్లో ( Indian Cricket ) బెస్ట్ ఓపెనింగ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ), సచిన్ టెండూల్కర్ జోడి. సచిన్, సెహ్వాగ్ ఓపెనింగ్‌లో బ్యాటింగ్‌కు దిగే ముందు సౌరవ్ గంగూలి ( Sourav Ganguly ), సచిన్ జోడి టాప్‌లో ఉండేది.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) అన్నిరంగాలను అతలాకుతలం చేస్తూనే ఉంది. రోజురోజుకి పెరుగుతున్న కేసులు, మరణాలతో ఆర్థికరంగం, పర్యాటక రంగం, క్రీడారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కెప్టెన్‌గా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అని, టీమిండియాకు అతడు వేసిన పునాదులే అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ అందించిన విజయాలకు బాటలు వేశాయని క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర (Kumar Sangakkara) అభిప్రాయపడ్డాడు.
Gautam Gambhir vs MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీపై అవకాశం చిక్కిన ప్రతీసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపి ఎంపీ గౌతం గంభీర్.. తాజాగా ధోనీ కెప్టేన్సీపై మరోసారి విరుచుకుపడ్డారు. టీమిండియాకు తగిన సంఖ్యలో గొప్ప ఆటగాళ్లను అందించడంలో సౌరబ్ గంగూలీలా ( Sourav Ganguly ) ధోనీ విజయం సాధించలేకపోయాడని గౌతం గంభీర్ అభిప్రాయపడ్డారు.
ఆసియాకప్-2020 రద్దైనట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ప్రకటించారు. కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి వల్ల ఇప్పటికే పలు టోర్నమెంట్లు వాయిదా పడ్డాయని, మరికొన్ని రద్దు కూడా అయ్యాయని ఆయన పేర్కొన్నారు.
Sourav Ganguly Birthday | 1990 దశకం చివర్లో, 2000 దశకంలో క్రికెట్ చూసిన ప్రతి ఒక్కరికీ గంగూలీ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటగాడిగా కంటే కెప్టెన్‌గా కూడా గంగూలీ తనదైన ముద్రవేశాడు. నేడు ‘కింగ్ ఆఫ్ ఆఫ్‌సైడ్’ సౌరవ్ గంగూలీ జన్మదినం.
Ganguly About Sachin Tendulkar on 1st ball of match | భారత క్రికెట్లో ఓపెనర్లంటే గుర్తొచ్చేది సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ ద్వయం. అయితే సచిన్ మాత్రం ఎప్పుడూ నాన్ స్ట్రైకింగ్ తీసుకునేందుకు ఇష్టపడేవాడు. సెహ్వాగ్‌తో ఆడినప్పుడు సైతం సచిన్ నాన్ స్ట్రైకింగ్ తీసుకునేవాడని తెలిసిందే.
ఓవైపు ఐపీఎల్ ఎప్పుడు మొదలవుతుందా అని, లీగ్ కోసం గంగూలీ (Sourav Ganguly) కసరత్తులు చేస్తుంటే మరోవైపు ఆయన కుటుంబసభ్యులు కరోనా సమస్యలో చిక్కుకున్నారు. గంగూలీ సోదరుడిని హోమ్ క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు.
T20 World Cup 2020 : టీ20 వరల్డ్ కప్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్ ( Earl Eddings ) కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ - నవంబర్ మధ్య ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను నిర్వహించడం సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదని ఎర్ల్ ఎడింగ్స్ అభిప్రాయపడ్డాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌ను కచ్చితంగా నిర్వహించి తీరుతామని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. ఖాళీ స్టేడియాల్లోనైనా సరే ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.
భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన సౌరవ్ గంగూలీ ఐసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపడితే చూడాలనుందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అన్నాడు. ఈ నెలలో ఐసీసీ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ పదవీ కాలం ముగియనుండటంతో తర్వాత అధ్యక్షుడు ఎవరన్నదానిపై చర్చ జరుగుతోంది.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెట్ టోర్నమెంట్స్ వాయిదా పడటంతో అన్ని దేశాలకు చెందిన క్రికెట్ బోర్డ్స్ తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్న విషయం తాజాగా ఐసిసి నిర్వహించిన సమావేశంలో చర్చకొచ్చింది. అయితే, ఇదే ఐసిసి సమావేశంలో బీసీసీఐ ప్రతినిధిగా పాల్గొన్న బీసీసీఐ కార్యదర్శి జే షా.. ఈ విషయంలో ఐసిసికి ఓ ప్రతిపాదన చేశారు.
కరోనావైరస్ (Coronavirus attack) దాడి కారణంగా తలెత్తిన ఊహించని విపత్తును ఎదుర్కునేందుకు కేంద్రం చేస్తోన్న పోరాటానికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుంచి భారీ మొత్తంలో విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా కార్యక్రమాలు రద్దు చేయబడగా, మరికొన్ని వాయిదా వేయబడ్డాయి. కాగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్, ఈ ఏడాది చివర్లో జూలై-ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌జరగడంపై కూడా తీవ్ర అనుమానాలు, బెదిరింపులు వస్తున్నా
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్తనందించింది. భారత్ పాక్ ల మధ్య ఆసక్తికర పోరు దుబాయ్ లో జరగనుందని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ భారత క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు. ఆసియా ఖండం స్థాయిలో అగ్రశ్రేణి
క్రికెట్ ప్రపంచం దాదాగా పిలుచుకొనే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ మళ్లీ బ్యాట్ పట్టాడు. రిటైర్డ్ అయిన ఏళ్లు గడిచినప్పటికీ ..దాదా మళ్లీ బ్యాట్ పట్టడమేంటని ఆశ్చర్యపోకండి.. ఔను ఇది ముమ్మాటికి నిజం.... విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే మరి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.