Janasena Tamilnadu Politics: హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. పార్టీ పుట్టిన తెలంగాణలో కాకుండా ఏపీలో రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. ప్రస్తుతం జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కాకుండా తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.
Tamilnadu politics: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాట ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి, తమిళ చిన్నమ్మ శశికళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె చేసిన ప్రకటన తమిళ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
చిన్నమ్మ జైలు నుంచి బయటకొచ్చేందుకు నిర్ణయించుకున్నారు. నిబంధనల ప్రకారం నిర్ణీత జరిమానా చెల్లించి 2021 ఫిబ్రవరిలో విడుదలయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. స్వయంగా శశికళే తన న్యాయవాదికి రాసిన లేఖతో స్పష్టమైంది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. రాజకీయ ఆరంగేట్రం ఎప్పుడు..? ఎప్పటి వరకు పార్టీ స్థాపించనున్నారు..? ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? ఇలాంటి ప్రశ్నలకు మరికొద్ది రోజుల్లోనే సమాధానాలు లభించనున్నాయి. ఈ క్రమంలో ఆయన త్వరలోనే ప్రకటన విడుదల చేస్తారని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
కాంగ్రెస్ మహిళ ఎమ్మెల్యే విజయధరణి విషయంలో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పి.ధన్ పాల్ అభ్యంతరకర రీతిలో స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. తన నియోజకవర్గంలో షార్ట్ సర్క్యూట్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ఇచ్చే పరిహారం అంశాన్ని సభలో ఎమ్మెల్యే ధరణి ప్రశ్నించే ప్రయత్నం చేయగా స్పీకర్ దీన్ని స్పీకర్ తిరస్కరించారు. ఈ సమస్యపై సభాపతి స్పందించాలని మహిళా ఎమ్మెల్యే వారించగా .. సంబంధిత శాఖమంత్రితో వ్యక్తిగతంగా డీల్ చేసుకోవాలని చెప్పినట్లు సమచారం.
తమిళనాడులో డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్, రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి విచ్చేసిన సినీ నటుడు రజనీకాంత్ ప్రసంగించారు.
తమిళనాడు రాష్ట్రానికి బలమైన నాయకత్వం అవసరం అని అభిప్రాయపడ్డారు ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఏ.ఆర్ రెహ్మాన్. తాను సంగీత పరిశ్రమలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పూర్తి చేసుకుంటూ దేశవ్యాప్తంగా లైన్ కన్సర్ట్స్ నిర్వహిస్తున్న ఈ ఆస్కార్ అవార్డ్ విన్నర్.. ఈ నెల 12వ తేదీన చెన్నైలో అక్కడి అభిమానుల ముందు పర్ఫామ్ చేయనున్నారు. తమిళనాడుపై తనకి వున్న గౌరవ భావాన్ని చాటుకుంటూ 'నెత్రు ఇంద్రు నాలై' ( నాడు నేడు రేపు) పేరిట నిర్వహించనున్న ఈ లైవ్ కన్సర్ట్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్న సందర్భంగా ఆయనతో ముచ్చటించిన మీడియా మిత్రులు..
జీవితంపై కసి పెంచిన కడు పేదరికం, తాను నమ్ముకున్న కళపై ప్రాణం.. ఏం చేసినా ప్రత్యేకత వుండాలనుకునే తపన, ఎంత ఎదిగినా ఒదిగి వుండాలనుకునే సింప్లిసిటీకి నిలువెత్తు రూపమే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్!!
తమిళ తళైవా రాజకీయరంగ ప్రవేశం తమిళనాడులోని రజినీకాంత్ అభిమానులకే కాదు... అతడి ఆప్తమిత్రుడైన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కి సైతం అమితమైన ఆనందాన్ని కలిగించినట్టుంది! అందుకే కాబోలు.. "నా ఆత్మీయమిత్రుడు, మానవతావాది సూపర్ స్టార్ రజినీకాంత్‌కి రాజకీయాల్లో అంతా శుభమే కలగాలని కోరుకుంటున్నాను'' అంటూ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు బిగ్ బి.
రజినీకాంత్ తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టుగా అలా ప్రకటించారో లేదో అప్పుడే సోషల్ మీడియాలో రకరకాల జోకులు, సెటైర్లు ట్రెండ్ అవడం మొదలుపెట్టాయి. అందులో కొంతమంది రజనీకాంత్ సామర్థ్యాలని ప్రశంసిస్తే, ఇంకొంతమంది అతడి వ్యక్తిత్వంపై సెటైర్లు వేస్తూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై పోస్టులు పెట్టడం ప్రారంభించారు.
రజినీకాంత్ ఓ నిరక్షరాస్యుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యన్ స్వామి. అంతటితో ఆగని బీజేపీ అగ్రనేత మరిన్ని ఆరోపణలతో రజినీకాంత్‌పై విమర్శల దాడి మొదలుపెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.