Honda Nx 200 Price: 184 cc ఇంజన్‌తో హోండా NX200 బైక్ లాంచ్‌.. అబ్బబ్బా ఫీచర్స్‌ భలే ఉన్నాయ్..

Honda Nx 200 Bike Price In India: ప్రీమియం ఫీచర్స్‌తో అద్భుతమైన మోటర్‌సైకిల్‌ లాంచ్‌ అయ్యింది. దీనిని హోండా కంపెనీ అద్భుతమైన డిజైన్‌తో విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 14, 2025, 03:08 PM IST
Honda Nx 200 Price: 184 cc ఇంజన్‌తో హోండా NX200 బైక్ లాంచ్‌.. అబ్బబ్బా ఫీచర్స్‌ భలే ఉన్నాయ్..

Honda Nx 200 Bike Price In India: ప్రముఖ మోటర్‌సైకిల్ కంపెనీ హోండా మార్కెట్‌లోకి అద్భుతమైన బైక్‌ను విడుదల చేసింది. ఇది కొత్త లుక్‌తో పాటు అద్భుతమైన డిజైన్‌తో లాంచ్‌ అయ్యింది. హోండా కంపెనీ NX200 పేరుతో మోటర్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఈ మోటర్‌సైకిల్‌ను కంపెనీ  స్పోర్టీ లుక్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది శక్తివంతమైన ఇంజన్‌తో విడుదలైనట్లు కంపెనీ వెల్లడించింది. దీని ధర రూ. 1.68 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండబోతున్నట్లు హోండా కంపెనీ తెలిపింది. అయితే ఈ హోండా NX 200 బైక్‌ ఏయే ఫీచర్స్‌తో అందుబాటులో ఉందో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ హోండా NX200 బైక్ అనేక రకాల అధునాతన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది కొత్త TFT డిస్ప్లేతో పాటు డ్యూయల్-ఛానల్ ABS ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ NX200 బైక్‌ CB200X మోటర్‌సైకిల్‌కి సక్సెసర్‌గా అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే ఈ మోటర్‌సైకిల్‌ ప్రత్యేకమైన బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి కాల్ అయినా.. మెసేజ్ నోటిఫికేషన్స్‌ సులభంగా ఈ డిస్ప్లేలో చూడవచ్చు. 

ఈ మోటర్‌సైకిల్‌ బోల్డ్ ఫ్యూయల్ ట్యాంక్‌తో పాటు LED హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా X-ఆకారపు LED టెయిల్ ల్యాంప్‌తో లభిస్తోంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన హోండా NX200 184 cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో అందుబాటులోకి రానుంది. దీని ఇంజన్‌ 12.5 kW శక్తితో పాటు 15.7 Nm టార్క్‌ను ఉత్పత్తి  చేస్తుందని కంపెనీ వెల్లడించింది. అలాగే ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. లాంగ్‌ డ్రైవ్‌ వెల్లేవారికి ఈ బైక్‌ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రీమియం సీటింగ్‌తో రావడం వల్ల ఎక్కువ సేపు జర్నీ చేయోచ్చు.

AlsoRead: HMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదు

హోండా NX200 మోటర్‌సైకిల్‌ డ్యూయల్-ఛానల్ ABSతో పాటు ప్రత్యేకమైన డిస్క్ బ్రేక్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 1 లీటరు పెట్రోల్‌కు దాదాపు 50 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఎంతో ప్రత్యేకమైన హెడ్‌ ల్యాప్స్‌ను కూడా కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన డెలివరీలను మార్చిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే త్వరలోనే హోండా కంపెనీ ఈ బైక్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. 

AlsoRead: HMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News