IPhone 14 Plus in India: ప్రపంచంలో అత్యున్నత ప్రీమియం ప్రసిద్ధి కలిగిన బ్రాండ్లలో యాపిల్ బ్రాండ్ ఒకటి. ప్రతి ఒక్కరూ ఐఫోన్ కొనాలనుకుంటారు. కానీ వాటి రేటు కారణంగా కొనలేక పోతారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ గా భావించవచ్చు. ఇటీవలే లాంచ్ చేసిన ఐఫోన్ 14 ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో తక్కువ ధరలకే అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 7న భారత్ మార్కెట్లోకి ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ను విడుదల చేసింది యాపిల్ సంస్థ. సెప్టెంబర్ 7 విడుదల చేసిన పలు కారణాలవల్ల మార్కెట్లో ఈ ఫోన్లు లభించలేదు. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో భాగంగా వినియోదారులకు ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఫోన్ ని చౌక ధరలో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ ఫోన్ ని కేవలం రూ. 22 వేల రూపాయల కంటే తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు. దీనిని ఎలా తక్కువ ధరతో కొనుగోలు చేయాలో మేము మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం..
ఐఫోన్ 14 ప్లస్ ను ఇలా ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు చేయండి:
ప్రస్తుతం ఐఫోన్ 14 ప్లస్ ఫ్లిప్కార్ట్ లో మూడు వేరియంట్లలో లభిస్తోంది. 128gb వేరియంట్ రూ. 89,900 ధరతో అందుబాటులో ఉంది. మీరు హెచ్ డిఎఫ్సి(HDFC) బ్యాంక్ క్రెడిట్ కార్డు ని ఉపయోగించి కొనుగోలు చేస్తే.. దాదాపు రూ. 2,750 తగ్గింపు లభిస్తోంది. దీంతో ఐఫోన్ 14 ప్లస్ ధర రూ. 87,150 అవుతుంది.
ఇలా కొనుగోలు చేస్తే కేవలం రూ. 22 వేల తక్కువ ధరతో ఐఫోన్ 14 ప్లస్ పొందొచ్చు:
ఐఫోన్ ని చాలా చౌకగా కొనుగోలు చేయాలంటే తప్పకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాల్సిందే.. మీకు విలువైన పాత ఫోన్ను ఎక్స్చేంజ్ చేసి దాదాపు రూ. 19,900 దాకా తగ్గింపు లభిస్తుంది. ఇక అన్ని ఆఫర్లు పోను రూ. 22,650 తగ్గింపుతో కేవలం మీరు రూ. 67,250 కి ఐఫోన్ 14 ప్లస్ ను కొనుగోలు చేయొచ్చు.
ఐఫోన్ లో 14 ప్రత్యేకమైన ఫీచర్లు:
>>128GB స్టోరేజ్‌తో ఈ వేరియంట్
>>6.7-అంగుళాల సూపర్ రెటినా XDR (XDR) డిస్‌ప్లే
>>A15 బయోనిక్ చిప్
>>డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
>>రెండూ 12MP సెన్సార్
>>12 ఎంపీ ఫ్రంట్ కెమెర
>>5G సాపోర్ట్
Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు
Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook