iQOO Z9S Pro 5G Price: అత్యంత తగ్గింపుతో 8Gb ర్యామ్, 256Gb ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్ అత్యంత తగ్గింపు ధరలో లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో iQOO Z9S Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇది Snapdragon 7 Gen 3 ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇది శక్తివంతమైన 5500Mah బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై లభిస్తున్న ఇతర ఇఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మార్కెట్‌లో iQOO Z9S Pro 5G స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అమెజాన్‌లో ఈ మొబైల్ MRP ధర రూ.31,999తో లభిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్ మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌తో పాటు రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అయితే దీనిని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.26,998కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిని కొన్ని క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపుల భిస్తుంది.
ఇక ఈ మొబైల్‌పై ఉన్న క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ iQOO Z9S Pro 5G మొబైల్‌ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగించి కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా డెబిట్ కార్డ్‌ను వినియోగించి కూడా ప్రత్యేకమైన తగ్గింపు పొందవచ్చు. ఇక అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కూడా భారీ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అన్ని పోనూ రూ.24,998కే కొత్త మొబైల్‌ను పొందవచ్చు. అలాగే ఈ మొబైల్‌పై ఎక్చేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారికి రూ.25,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
MediaTek Dimensity 9200 ప్రాసెసర్
6.78-inch AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేటు
Full HD+ రెజల్యూషన్
64MP ప్రైమరీ సెన్సార్ కెమెరా
8MP అల్ట్రావైడ్ సెన్సార్ కెమెరా
2MP మాక్రో సెన్సార్ కెమెరా
16MP సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ, 120W ఫ్లాష్ చార్జింగ్
Android 13-based iQOO UI 2.0 ఆపరేటింగ్ సిస్టమ్
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.