Itel S23 Plus Price: ప్రముఖ టెక్ బ్రాండ్ ఐటెల్ బడ్జెట్లో మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తోంది. ఇటీవల ఆఫ్రికన్ మార్కెట్లో ఐటెల్ S23+ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ ఇదే స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన సామాచారాన్ని టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ ఒక ట్వీట్లో వివరించారు. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో ధర రూ. 15,000 కంటే తక్కువతో లభించబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
భారతీయ మార్కెట్లో త్వరలోనే రూ.15,000 సెగ్మెంట్లో ఐటెల్ S23+ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఈ మొబైల్ కొత్త డివైజ్ 3డి కర్వ్డ్ డిస్ప్లేతో రాబోతోంది. అతి తక్కువ ధరలో కర్వ్డ్ డిస్ప్లేతో విడుదల చేయడం ఇదే మొదటి కంపెనీ అని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ట్రీపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?
itel S23+ స్పెసిఫికేషన్లు:
itel స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల AMOLED కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పూర్తి HD+ రిజల్యూషన్‌తో 99 శాతం DCI-P3 కలర్ గ్యామట్‌తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఈ మొబైల్ 500నిట్స్ హై బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్‌తో రాబోతోందని ప్రముఖ టిప్‌స్టార్ తెలిపారు. ఈ మొబైల్ అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో పాటు 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రాబోతోంది. ఈ itel S23+ స్మార్ట్‌ఫోన్ Unisoc T616 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.
itel S23+ ధర వివరాలు:
ఆఫ్రికా ధర వివరాల ప్రకారం..itel S23+ స్మార్ట్‌ఫోన్ ధర 112 యూరోలకి లభిస్తోంది. దాదాపు భారత్‌లో దీని ధర రూ. 10,000కు పైగా ఉంటుంది. ఈ మొబైల్ ప్రస్తుతం రెండు (లేక్ సియాన్ + ఎలిమెంటల్ బ్లూ) రెండు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంది. అయితే భారత్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అన్ని డిస్కౌంట్స్ పోను రూ. 12,000లోపు లభించే ఛాన్స్‌లు ఉన్నాయి.
itel S23+ ఇతర ఫీచర్స్:
6.78 అంగుళాల AMOLED కర్వ్డ్ డిస్ప్లే
32MP ఫ్రంట్ కెమెరా
50MP ప్రైమరీ కెమెరా
Android 13
Aivana GPT ఆధారిత AI వాయిస్ అసిస్టెంట్
డైనమిక్ ఐలాండ్ ఫీచర్
డైనమిక్ బార్ ఫీచర్
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook