OnePlus Nord CE 4 Lite స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీపై స్పష్టత వచ్చింది. జూన్ 18వ తేదీన ఇండియాలో లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. అటు అమెజాన్ కూడా ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్, శాంసంగ్‌లతో పోటీ పడే మరో ఫోన్ వన్‌ప్లస్ అద్భుతమైన ఫీచర్లు, కెమేరా, రిజల్యూషన్ ఈ ఫోన్ సొంతం. అన్నింటికీ మించి డిజైన్, మన్నిక విషయంలో వన్‌ప్లస్ పెట్టింది పేరు. అందుకే చాలామంది వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై ఆసక్తి చూపిస్తుంటారు. OnePlus Nord CE 4 Lite అనేది 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ డిస్‌ప్లే రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 చిప్‌సెట్ ఉంటుంది. మూడేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుతాయి.
OnePlus Nord CE 4 Lite 80 వాట్స్ ఫాస్ట్‌ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇందులో 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. మెగా బ్లూతో సహా చాలా రంగుల్లో అందుబాటులో ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమేరా ఉంటాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది.
OnePlus Nord CE 4 Lite ధర ఇండియాలో20 వేల కంటే తక్కువే ఉండవచ్చని తెలుస్తోంది. జూన్ 18 సాయంత్రం 7 గంటలకు విడుదల కానుంది. అమెజాన్ ద్వారా విక్రయాలు జరగనున్నాయి.
Also read: Bajaj CNG Bike: ప్రపంచంలో మొదటి సీఎన్జీ బైక్ లాంచ్ ఎప్పుడు, ధర ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook