Oppo K12x Price: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న Oppo కొత్త స్మార్ట్‌ఫోన్ రానే వచ్చేసింది. వీవో కంపెనీ Oppo K12x 5G పేరుతో మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఇది అనేక రకాల అద్భుతమైన ఫీచర్స్‌తో లభిస్తోంది. ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన మొబైల్స్‌కి మంచి గుర్తింపు లభించడంతో ఈ కే సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇది గరిష్టంగా 12 GB ర్యామ్, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లేతో కూడి డిప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo K12x ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ఈ Oppo K12x స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ HD + ఫ్లాట్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని స్క్రీన్ 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఇది స్లిమ్ బెజెల్స్‌తో అందుబాటుకి వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ 2100 నిట్‌ల వరకు లోకల్ పీక్ బ్రైట్‌నెస్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ మొబైల్ 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వచ్చింది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ప్రాసెసర్ వివరాల్లోకి వెళితే, ఇది స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌పై పని చేస్తుంది. దీంతో పాటు దీని బ్యాక్ సెట్‌లో డబుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్స్ ఉంటుంది. ఇక రెండవ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఫ్రంట్ సెటప్ విషయానికొస్తే, ఇది 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది 5500mAh బ్యాటరీతో లభిస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఈ ఫోన్‌ను సులభంగా ఛార్జ్ చేసేందుకు 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇందులో భద్రత కోసం బయోమెట్రిక్ లాక్ సెటప్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అదనంగా అందిస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన OS విషయానికొస్తే, ఇది Android 14 ఆధారంగా ColorOS 14పై రన్ అవుతుంది. ఇవే కాకుండా అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో ఈ మొబైల్ అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ధర విషయానికొస్తే ఇది భారత్‌లో రూ.15 వేలలోపే లభించబోతోంది. అయితే కంపెనీ దీనిని చైనాలోనే లాంచ్ చేసింది. త్వరలోనే భారత్‌లో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి