5000Mah Powerful Battery Poco C65 Mobile Launched : ప్రముఖ చైనీస్ కంపెనీ పోకో(POCO) అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న POCO C65 స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ C-సిరీస్ లైనప్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ ఫోన్ ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన Redmi 13C మొబైల్‌ను పోలి ఉంటుంది. ఈ స్మార్ ఫోన్‌కి సంబంధించిన విక్రయాలు డిసెంబర్ 18 తేదిన ప్రారంభం కానున్నాయి. ఈ POCO C65 స్మార్ట్ ఫోన్ 50-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుంది. పోకో సీ65 8GB ర్యామ్ MediaTek Helio G85 చిప్‌సెట్‌పై పని చేస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై కంపెనీ రెండేళ్ల ఆండ్రాయిడ్ OS సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
POCO C65 వేరియంట్స్, ధర వివరాలు:
POCO C65 4GB + 128GB వేరియంట్ ధర రూ. 8,499.
POCO C65 6GB + 128GB వేరియంట్ రూ. 9,499.
POCO C65 8GB + 256GB వేరియంట్ ధర రూ.10,999.
ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన విక్రయాలను కంపెనీ డిసెంబర్ 18 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభివచబోతున్నట్లు పేర్కొంది. మొదట ఈ మొబైల్ బ్లాక్, పాస్టెల్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తోంది. అయితే POCO కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ మొబైల్‌కి సంబంధించిన మొదటి సేల్ డిసెంబర్ 18 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే అదనపు తగ్గింపు కోసం బ్యాంక్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. ఈ బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.
Poco C65 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు:
Poco C65 90Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో కూడిన 6.74-అంగుళాల HD+ (720 x 1,600 పిక్సెల్‌లు) LCD డిస్ల్పేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G85 SoC చిప్‌సెట్‌పై పని చేస్తుంది. ఈ Poco C65 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో మొదటి కెమెరా f/1.8 ఎపర్చరుతో 50-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు సెల్ఫీ కోసం 8-మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంటుంది.
పోకో కంపెనీ Poco C65 మొబైల్ ఫోన్‌ను గరిష్టంగా 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందిస్తోంది. అంతేకాకుండా మైక్రో SD కార్డ్ స్లాట్ వినియోగించి స్టోరేజ్‌ని కూడా పెంచుకునే ఫీచర్‌ను అందిస్తోంద. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన కనెక్టివిటీ విషయానికొస్తే..4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ మొబైల్ FM రేడియో మద్దతుతో 3.5mm ఆడియో జాక్‌తో అందుబాటులో ఉంటుంది.
ఇతర ఫీచర్స్:
యాక్సిలరోమీటర్ సెన్సార్
యాంబియంట్ లైట్ సెన్సార్
ఇ-కంపాస్ సెన్సార్
వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్
5,000mAh బ్యాటరీ
USB టైప్-సి పోర్ట్
18W ఛార్జింగ్ సపోర్ట్
బయోమెట్రిక్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి