Realme Gt Neo 6 Se: కొత్త AI ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Realme Gt Neo 6 Se మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే!

Realme Gt Neo 6 Se: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ మొబైల్‌ అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 11, 2024, 02:15 PM IST
Realme Gt Neo 6 Se: కొత్త AI ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Realme Gt Neo 6 Se మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే!

 

Realme Gt Neo 6 Se: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ Realme మార్కెట్‌లోకి మరో శక్తివంతమైన మొబైల్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌ మీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను Realme GT Neo 6 SE పేరుతో లాంచ్‌ చేసింది. కంపెనీ దీనిని మొదటగా చైనాలో విడుదల చేసింది. త్వరలోనే గ్లోబల్‌ లాంచ్‌ కూడా చేయబోతున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌ అనేక రకాల కొత్త కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ మొబైల్ శక్తివంతమైన డిస్ల్పేతో 6000 nits పీక్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్‌ని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో పాటు అనేక రకాల AI ఫీచర్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు:
రియల్‌మీ GT Neo 6 SE స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఇది 6.78 అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED ప్యానెల్‌ డిస్ల్పేను కలిగి ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీని తయారీ కోసం కంపెనీ S1 ల్యుమినిసెంట్ మెటీరియల్‌ని వినియోగించినట్టు కూడా కంపెనీ పేర్కొంది. అలాగే ఈ మొబైల్‌ స్క్రీన్‌ 6000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ను కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ దీని స్క్రీన్‌ 2780x1264 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు దీనిని కంపెనీ 8T LTPO టెక్నాలజీతో లాంచ్‌ చేసింది.

ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ డిస్ల్పే గేమింగ్‌ కోసం చాలా బాగా పని చేస్తుంది. దీంతో పాటు 2160 Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ మొబైల్‌ డిప్ల్పే ప్రోటక్షన్‌ కోసం, కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 ప్రోటక్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ గ్రీన్‌ఫీల్డ్ AI ఐ ప్రొటెక్షన్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. ఇది గేమింగ్‌ చేసేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ఫీచర్‌ కంటిని ప్రొటెక్ట్‌ చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలోనే ఈ మొబైల్‌ను కంపెనీ మొట్టమొదటి సారిగా యాక్టివ్ ఐ ప్రొటెక్షన్ సొల్యూషన్‌తో లాంచ్‌ చేసిన్నట్లు కంపెనీ పేర్కొంది.

రియల్‌మీ GT నియో 6 ఎస్‌ఈ టాప్‌ 10 ఫీచర్స్‌
స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్
1.5K LTPO OLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్‌
50MP ప్రధాన కెమెరా
Sony IMX766 సెన్సార్‌ కెమెరా
8GB ర్యామ్‌, 128GB స్టోరేజ్

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..
4,500mAh బ్యాటరీ
80W SuperDart ఛార్జింగ్‌ సపోర్ట్
బర్నింగ్ మోడ్
ఆండ్రాయిడ్ 13
5G కనెక్టివిటీ
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
మెటాలిక్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌
బ్యాండ్ స్పోర్ట్స్ యాంటెన్నా మ్యాట్రిక్స్ ఫీచర్స్‌
స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్‌
10014 mm² హీట్ డిస్సిపేషన్ సిస్టమ్‌

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News