Motorola Razr 50: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటరోలా (Motorola) మార్కెట్‌లోకి మరో కొత్త మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది అతి తక్కువ ధరలోనే ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో రాబోతోంది. కంపెనీ Motorola Razr 50 పేరుతో జూన్ 25వ తేదిన అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు ప్రకటించింది. దీనిని కంపెనీ ఫ్లిఫ్ వేరియంట్‌లో తీసుకు రానుంది. దీంతో పాటు ఈ సిరీస్‌ను కంపెనీ మొదట చైనాలో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కంపెనీ ప్రపంచ మార్కెట్‌లోకి కూడా లాంచ్ చేయబోతోంది. చైనాలో లాంచ్ అయిన వెంటనే ప్రపంచ మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు కంపెనీ ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నట్లు పలువు టిప్‌స్టర్స్ తెలిపారు. మోటరోలా కంపెనీ ఈ మొబైల్‌ను Motorola Razr 50, Razr 50 Ultra రెండు వేరియంట్స్‌లో తీసుకు రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Motorola Razr 50 సిరీస్ ఫీచర్స్ వివరాలు:
ఈ సిరీస్‌లో అల్ట్రా వేరియంట్ అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇక ఈ అల్ట్రా వేరియంట్ మొబైల్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇది OLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ డిస్ల్పే 4 అంగుళాల కవర్, 6.9 అంగుళాలను కలిగి ఉంటుంది. ఇందులో ప్రధాన డిస్‌ప్లే 1272x1080 రిజల్యూషన్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది వివిధ రకాల ర్యామ్ వేరియంట్‌లో రానుంది. గరిష్టంగా 18 జీబీ ర్యామ్‌ను కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే కంపెనీ బ్యాటరీ విషయంలో కాస్త వెనకడుగు వేసింది. ఎందుకంటే ఈ స్మార్ట్‌ఫోన్ 3800mAh బ్యాటరీ సెటప్‌తో లభిస్తోంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ఇతర ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. అల్ట్రా వేరియంట్‌లో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు ఈ మొబైల్ అత్యంత శక్తివంతమైన MediaTek Dimension 7300X చిప్‌సెట్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీని బ్యాక్ సెటప్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా వస్తోంది. దీంతో పాటు అద్భుతమైన 6.9 అంగుళాల కవర్ OLED డిస్‌ప్లే కూడా ఉంటుంది. అలాగే అదనంగా 3.6 అంగుళాల ఔటర్ డిస్‌ప్లే కూడా ఈ మొబైల్ చూడవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇక ఈ రెండు వేరియంట్స్ వివరాల్లోకి వెళితే, ఈ రెండింటి బ్యాక్ సెటప్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు అదనంగా 13-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ను కంపెనీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి తీసుకు రానుంది. ఇవే కాకుండా అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌ను కలిగి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి