Redmi Pad Pro 5G: షియోమీ నుంచి 5జి సపోర్ట్ సిమ్ కార్డుతో Redmi pad pro 5G త్వరలో లాంచ్, ఫీచర్లు ఇవీ

Redmi Pad Pro 5G: ప్రముఖ చైనా టెక్ దిగ్గజం షియోమీ నుంచి మరో కొత్త ప్యాడ్ లాంచ్ కానుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లతో ఈ స్మార్ట్ ట్యాబ్ వస్తోంది. ఈ ట్యాబ్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 30, 2024, 09:11 AM IST
Redmi Pad Pro 5G: షియోమీ నుంచి 5జి సపోర్ట్ సిమ్ కార్డుతో Redmi pad pro 5G త్వరలో లాంచ్, ఫీచర్లు ఇవీ

Redmi Pad Pro 5G: చైనా టెక్ దిగ్గజం షియోమీ కొత్త మోడల్ ట్యాబ్ లాంచ్ చేస్తోంది. రెడ్‌మి ప్యాడ్ ప్రో పేరుతో 5 జీ సపోర్టెడ్ ట్యాబ్ ఇంది. ఇందులో డ్యూయల్ సిమ్, జీపీఎస్ వంటి స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు అన్నీ ఉన్నాయి. చైనాలో లాంచ్ తరువాతే ఇండియాలో లాంచ్ కావచ్చు. కంపెనీ నుంచి లాంచ్ తేదీ విషయమై ఎలాంటి ప్రకటన ఇంకా వెలువడలేదు. 

రెడ్‌మి ప్యాడ్ ప్రో 5జి 12.1 ఇంచెస్ ఎల్సీడీ ప్యానెల్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా 2560 × 1600 రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉండటం వల్ల అద్బుతమన పిక్చర్ క్లారిటీ ఉంటుంది. అంతేకాకుండా 10000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంటుంది. ఈ ట్యాబ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 ఎస్ జనరేషన్ 2 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఈ ట్యాబ్‌లో 6జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ వేరియంట్లు 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లతో అందుబాటులో ఉండనున్నాయి. ఇక సెక్యూరిటీ పరంగా చూస్తే ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ ఉన్నాయి. కనెక్టివిటీ విషయంలో బ్లూటూత్ 5.2 వెర్షన్, వైఫై 6 సపోర్ట్ చేస్తుంది. దీనికితోడు డాల్బీ ఎట్మోస్ సపోర్ట్ క్వాడ్ స్పీకర్లు అమర్చడంతో మ్యూజిక్ అద్భుతంగా ఎంజాయ్ చేయవచ్చు. గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటుంది. 

ఈ ట్యాబ్ 33 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో జీపీఎస్, ఏజీపీఎస్, గ్లోనాస్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ సిమ్ కాకుండా ఫిజికల్ సిమ్ ఉంటుంది. 600 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉండటంతో స్క్రీన్‌కు రక్షణ ఉంటుంది. కెమేరా విషయానికొస్తే 8 మెగాపిక్సెల్ రేరే సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. 

డిజైన్ అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న రెడ్‌మి ప్యాడ్ ప్రో ఉన్నట్టే ఉంటుంది. అయితే ఇది మాత్రం 5జి సిమ్ వెర్షన్ స్మార్ట్ ట్యాబ్. మీ స్మార్ట్‌ఫోన్ హాట్ స్పాట్‌ను సులభంగా కనెక్ట్ చేసుకోగలదు.

Also read: 7th Phase Lok Sabha Polls 2024: నేటితో ముగియననున్న చివరి దశ ఎన్నికల ప్రచారం.. జూన్ 1 పోలింగ్

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News