Minister sabitha: తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే..!

Minister sabitha: తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చాయి.ఫలితాల్లో 97 శాతంతో సిద్దిపేట టాప్‌లో ఉండగా..79 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్‌ చివర్లో నిలిచింది.పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇప్పుడు చూద్దాం..

Written by - Alla Swamy | Last Updated : Jun 30, 2022, 01:13 PM IST
  • తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు
  • విడుదల చేసిన మంత్రి సబితా
  • 97 శాతంతో సిద్దిపేట టాప్‌
Minister sabitha: తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే..!

Minister sabitha: తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చాయి. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈవిషయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 15 స్కూళ్లలో ఒక్కరూ పాస్‌ కాలేదన్నారు. 3 వేలకు పైగా స్కూళ్లల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యిందని వెల్లడించారు. ఫలితాల్లో 97 శాతంతో సిద్దిపేట టాప్‌లో ఉండగా..79 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్‌ చివర్లో నిలిచిందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

మే 23 నుంచి ఈనెల 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. తెలంగాణలో మొత్తంగా 5 లక్షల 3 వేల 579 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కరోనా సమయంలో అధికారులు, ఉపాధ్యాయులు చూపిన చొరవను మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. దూరదర్శన్‌, టీ శాట్ ద్వారా విద్యను అందించామని గుర్తు చేశారు. వాట్సాప్ గ్రూపులు, వర్క్ షీట్ ఏర్పాటుతో విద్యార్థులకు చేరువయ్యారన్నారు.

ఫెయిలైన విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అవసరమైతే విద్యార్థులు రాసిన పరీక్ష పేపర్ల జిరాక్స్ అందిస్తామని స్పష్టం చేశారు. ఫెయిలైన విద్యార్థులకు వారానికి రెండు సార్లు ఐనా ప్రత్యేక తరగతులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై త్వరలో ఆదేశాలు వస్తాయని మంత్రి వెల్లడించారు. దీనిని ఉపాధ్యాయులు భారంగా కాకుండా బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.

Also read: Courses After 10th Class: పదో తరగతి తర్వాత ఏం చేయాలి... ఏయే కోర్సులు అందుబాటులో ఉంటాయి...

Also read:GST Rate: దేశంలో సామాన్యులకు మరో షాక్‌..ఏ ఏ వస్తువులపై జీఎస్టీ పన్ను ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News