Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ యాక్షన్ ప్లాన్.. నేరుగా రంగంలోకి అమిత్ షా..!

Telangana Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రిజల్ట్ రావడంతో బీజేపీ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది. కేంద్రంలో అధికారమే చేపట్టడమే లక్ష్యంగా ప్లాన్ రూపొందిస్తోంది. గత ఎన్నికల కంటే మెజారిటీ సీట్లు కైవసం చేసుకునేందుకు గ్రౌండ్ లెవల్‌లో సిద్ధమవుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2024, 11:27 PM IST
Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ యాక్షన్ ప్లాన్.. నేరుగా రంగంలోకి అమిత్ షా..!

Telangana Lok Sabha Elections: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల బీజేపీ గెలిచింది. గత ఎన్నికలతో పోలిస్తే.. ఓట్ల శాతం మెరుగుపరుచుకుంది. 8 స్థానాల్లో 30 లక్షలకు పైగా ఓట్లతో 14 శాతం ఓటింగ్‌ సాధించింది బీజేపీ. అయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్న భావనతో ఉన్న పార్టీ అధినాయకత్వం పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసింది. 

తెలంగాణలో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. బండి సంజయ్‌, అర్వింద్, కిషన్‌రెడ్డి, సోయం బాపూరావు బీజేపీ తరుపున గెలిచారు. ఈసారి మాత్రం పదికి పైగా స్థానాలపై గురి పెట్టింది బీజేపీ అధిష్టానం. ఇందుకోసం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లే వ్యూహాన్ని అమలు చేయనున్నారు. ఉత్తర తెలంగాణాలో పార్టీకి మంచి పట్టు రావడంతో ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సీట్ల ఎంపిక నుంచి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైపు క్యాడర్‌కు మార్గ నిర్దేశం చేసేందుకు ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు. కొద్దీ రోజుల్లో ఢిల్లీ నుండి పరిశీలకులు కూడా రాబోతున్నారు.

కేంద్ర మంత్రి అమిత్ షా నాయకత్వం లో హైదరాబద్ లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై క్యాడర్‌కు ఈ సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. అటు పెద్ద సంఖ్యలోనే టికెట్ ఆశిస్తున్న వారు ఉండటంతో గెలుపు గుర్రాల ఎంపికపైనా పార్టీలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడు వరకు 1200 మందితో భేటీ కానున్నారు. పార్టీలో సంస్థాగత మార్పులు, అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

మూడో సారి కూడా కేంద్రంలో అధికారం లోకి రావాలనుకుంటున్న బీజేపీ ప్రతి సీటును కూడా సీరియస్‌గా తీసుకుంటోంది. రాష్ట్రంలో మంచి ఊపులో ఉంది కాబట్టి ఈ సారి దక్షిణ తెలంగాణలో బోణి కొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఎంపీ టికెట్ల ఆశిస్తున్న వారిపై బీజేపీ అగ్రనేత అమిత్ షా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే వారికే ఛాన్స్‌ అని ఇప్పటికే ఆయన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని గెలుస్తారన్న వారికే టికెట్లు ఇవ్వాలని అమిత్ షా భావిస్తున్నారట. దీంతో ఆశావహుల్లో అప్పుడే టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద కనీసం పది ఎంపీ స్థానాలు గెలిచే వ్యూహంతో కమలం పార్టీ పావులు కదుపుతోంది.

Also Read: Oppo Reno 11 Series: శక్తివంతమైన 50MP కెమెరాతో మార్కెట్‌లోకి Oppo Reno 11, Reno 11 Pro మొబైల్స్‌..విడుదల తేది అప్పుడే..

Also Read: Ayodhya Rammandir Features: అయోధ్య రామమందిరం ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News