Light Rail in Hyderabad: కూకట్‌పల్లి టు కోకాపేట మార్గంలో లైట్ రైల్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్..

Light Rail in Hyderabad : హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి నుంచి కోకాపేట వరకు భవిష్యత్తులో లైట్ రైల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు దీనికి సంబంధించిన డీపీఆర్ సిద్దం చేసే పనిలో నిమగ్నమయ్యారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2021, 02:18 PM IST
  • కూకట్‌పల్లి టు కోకాపేట మార్గంలో లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌
    ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు
    డీపీఆర్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమైన అధికారులు
 Light Rail in Hyderabad: కూకట్‌పల్లి టు కోకాపేట మార్గంలో లైట్ రైల్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్..

Light Rail in Hyderabad: హైదరాబాద్ నగర పరిధి రోజురోజుకు విస్తృతి చెందుతూనే ఉంది. నగర జనాభా అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థపై ఫోకస్ చేశారు. నగరంలోని కూకట్‌పల్లి నుంచి కోకాపేట్ వరకూ  లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (Light Rail Transit System)ను అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

దేశంలోనే అతిపెద్ద హౌజింగ్ బోర్డుగా ఉన్న కూకట్‌పల్లి (Kukatpally) నుంచి వందల సంఖ్యలో కంపెనీలు కొలువైన గచ్చిబౌలి, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీదుగా కోకాపేట వరకు లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (Light Rail Transit System)ను అందుబాటులోకి తీసుకొస్తే ఆ ప్రాంతంలో పనిచేసే ఉద్యోగుల రాకపోకలకు అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో మరిన్ని కంపెనీలు కొలువయ్యే అవకాశం ఉన్నందునా... ఇప్పటినుంచే ఈ మార్గంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలనే యోచనలో ఉన్నారు.

Also Read: Samantha Remuneration: 'పుష్ప'లో ఐటెం సాంగ్ కోసం రూ.1.5 కోట్లు తీసుకుంటున్న సమంత..??

కూకట్‌పల్లి (Kukatpally) నుంచి కోకాపేట వరకు సుమారు 24.50 కి.మీ దూరం ఉంటుంది. ఈ మార్గంలో లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (Light Rail Transit System)ను అందుబాటులోకి తీసుకొస్తే... కేపీహెచ్‌బీ, రాయదుర్గం, హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్లు, ఎంఎంటీఎస్ స్టేషన్‌ను అనుసంధానం చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ యునిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్‌పోర్ట్‌ అథారిటీ (హెచ్‌యూఎంటీఏ) దీనిపై డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ, హెచ్ఎంఆర్ ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News