Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు తప్పదా, రేపు ఏం జరగనుంది

Delhi Liquor Case: దేశంలో సంచలనం కల్గించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. రేపు ఈడీ విచారణ నేపధ్యంలో హైదరాబాద్ కవిత ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటైంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 8, 2023, 12:15 PM IST
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు తప్పదా, రేపు ఏం జరగనుంది

Delhi Liquor Case: ఓ వైపు ఈడీ నోటీసులు మరోవైపు ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన ధర్నా కార్యక్రమం నేపధ్యంలో ఏం జరుగుతుందోననే ఆందోళన అధికమైంది. విచారణకు హాజరుకాకుంటే అరెస్టు తప్పదనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. సరిగ్గా ధర్నాకు ఓ రోజు ముందు విచారణ ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు..దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో లింకులున్న ఈ కుంభకోణంలో అటు సీబీఐ ఇటు ఈడీ దర్యాప్తు ముమ్మరమౌతోంది. ఈ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయవచ్చనే వార్తలు వైరల్ అవుతున్నాయి. 

ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లను సీబీఐ అరెస్టు చేసింది. మరోవైపు కీలకమైన వ్యక్తుల్ని ఒక్కొక్కరిగా అరెస్టు చేస్తోంది. తాజాగా ఈ కేసులో హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అరెస్టు చేసింది. అంతేకాకుండా..రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. అందుకే ఎమ్మెల్సీ కవిత రేపు అంటే మార్చ్ 9వ తేదీన విచారణకు హాజరుకావల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇదే కేసు విషయమై ఎమ్మెల్సీ కవితను డిసెంబర్ 11వ తేదీన సీబీఐ విచారించింది. 

ఈ విషయమై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత ధర్నా కార్యక్రమం చేపట్టారు. చట్టాన్ని గౌరవించి ఈడీ విచారణకు సహకరిస్తానని అయితే ఢిల్లీ కార్యక్రమం ప్రీ షెడ్యూల్ కావడంతో న్యాయ సలహా తీసుకుంటానని చెప్పారు. మరోవైపు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లే దారుల్ని మూసివేశారు. కవిత ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటైంది. ఎవరినీ అనుమతించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా ప్రజా వ్యతిరేక పార్టీకు తెలంగాణ ఎప్పటికీ తలవంచదని కవిత స్పష్టం చేశారు

Also read:  Bandi Sanjay Kumar: కేసీఆర్ వల్లే పాతబస్తీలో ఉగ్రవాదులకు రేషన్ కార్డులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News