Discord at Minister Konda Surekha birthday celebration in Warangal: రాఖీ పండుగను దేశంలో ఘనంగా జరుపుకుంటున్నారు. తమ తోబుట్టువులకు రాఖీలు కట్టేందుకు అక్కా చెల్లెళ్లు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఎంత దూరంలో ఉన్నా.. కూడా తమ వాళ్ల దగ్గరకు వెళ్తున్నారు. రాఖీ అనేది సోదరులు, సోదరీమణుల మధ్య ఆప్యాయతలు, ప్రేమానురాగాలకు చెందిన పండుగ అని చెప్పవచ్చు. ఈరోజు రాఖీ కట్టి తమ వారిమీద ఉన్న ప్రేమను చాటుకుంటారు. రాఖీ పండుగ వేనకాల అనేక పౌరాణిక కథనాలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి.
మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో అపశ్రుతి
వరంగల్ - కాశిబుగ్గ జంక్షన్ వద్ద మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా బాణసంచా కాలుస్తుంటే.. రాఖీ కట్టడానికి వెళ్తున్న హరిణి అనే యువతి కాలిపై నిప్పు రవ్వలు పడి కాలికి గాయాలయ్యాయి. pic.twitter.com/wLR02blq9p
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2024
ఇంద్రుడి భార్య.. ఇంద్రాణి రాఖీ రక్ష కట్టి దానవుల మీద గెలిచేలా చేస్తుంది. అదే విధంగా.. ద్రౌపదీ కృష్ణుడికి కూడా రాఖీకడుతుంది. ఇదిలా ఉండగా.. వరంగల్ లో రాఖీ కట్టేందుకు వెళ్తున్న ఒక యువతికి షాకింగ్ ఘటన ఎదురైంది. ఈ ఘటన కాశిబుగ్గ జంక్షన్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జన్మదినం నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో.. వరంగల్ లోని..కాశిబుగ్గ జంక్షన్ వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమ అభిమాన మహిళా నేత.. పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా.. బాణా సంచాలు కాల్చారు. పెద్ద ఎత్తున రోడ్డుమీదనే బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు.
ఈ క్రమంలో ఒక్కసారిగా అనుకొని ఘటన చోటు చేసుకుంది. కార్యకర్తలు బాణా సంచాల పేల్చినప్పుడు.. కొన్ని టపాసులు.. అక్కడే యువతి మీద పడ్డాయి. దీంతో ఆమె కాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె కనీసం కాళ్లను తీసి కాళ్లుపెట్టలేనంతగా గాయలైనట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
సదరు యువతి.. రాఖీ సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్తుందంట.ఈ క్రమంలో ఈ ఘటన జరగటంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. మరోవైపు అసలే రాఖీపౌర్ణమి.. నిత్యం రద్దీగా ఉండే జంక్షన్ లో ఈ పనులు ఏంటని కూడా కొంత మంది విమర్శిస్తున్నారు. గాయపడిన యువతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.
బర్త్ డే విషేస్ చెప్పిన సీఎం రేవంత్..
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జన్మదినం నేపథ్యంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో ఉంటూ.. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు సీఎంపేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి