Harish Rao: ఇచ్చేది 1500.. ఎగ్గొట్టేది రూ.12 వేలు.. ప్రభుత్వంపై హరీష్‌ రావు ఫైర్

Harish Rao Fires On Revanth Reddy: రైతు భరోసా కింద రూ.1500 ఇచ్చి.. రూ.12 వేలు ఎగ్గొడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. 5 గుంటలు ఉన్నందుకు రూ.12 వేలు ఇవ్వమని ప్రభుత్వం చెప్పడం శోచనీయమన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 16, 2025, 11:34 AM IST
Harish Rao: ఇచ్చేది 1500.. ఎగ్గొట్టేది రూ.12 వేలు.. ప్రభుత్వంపై హరీష్‌ రావు ఫైర్

Harish Rao Fires On Revanth Reddy: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. వర్చువల్‌గా నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నారని అన్నారు. వీరంతా కూలీ పనికి వెళ్లే నిరుపేదలు అని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల ఎక్కువగా ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో కోటి 2 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఈ కార్డుల ద్వారా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారని చెప్పారు. గుంట భూమి ఉన్న రైతులను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించామని ప్రభుత్వం చెప్పడం దురదృష్టకరమన్నారు. ఒక్క సెంటు భూమి ఉన్నా కూలీ కాదని చెబుతున్నదని అన్నారు. 

"ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరం 20 రోజులు పని దినాలు ఉంటేనే కూలీగా గుర్తింపు అనే నిబంధన కూడా సరైనది కాదు. అనారోగ్య సమస్యలతోనూ ఇతర సమస్యలతోనూ పనికి వెళ్లని కూలీలను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించరని ప్రభుత్వం చెప్తున్నది. ఈ నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం మార్చి రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలి. ఐదు గుంటలు ఉన్న రైతుకు సంవత్సరానికి రైతు భరోసా కింద 1500 మాత్రమే వస్తాయి. ఐదు గుంటలు ఉన్న రైతుకు వ్యవసాయ కూలీ కింద 12000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నష్టపోతారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు.. తాతకు ఎకరం భూమి ఉంటే పిల్లలు పంచుకుంటే అది ఐదు గుంటలు వస్తాయి. 

5 గుంటలో పంట పండింది లేదు, వారు బతికింది లేదు. 5 గుంటలు ఉన్నందుకు 12 వేల రూపాయలు ఇవ్వమని ప్రభుత్వం చెప్పడం శోచనీయం. రైతు భరోసా కింద మీరు ఇస్తున్నది 1500 అయితే ఎగ్గొట్టేది 12 వేల రూపాయలు. రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు  24 లక్షల 57,000 మంది  ఉన్నారు. గుంట, రెండు గుంటలు ఉన్న రైతులు రైతు భరోసా తీసుకోవడం వల్ల రైతు కూలీలకు ఇచ్చే 12,000 నష్టపోతారు కాబట్టి. ఇలాంటి రైతులకు రైతు భరోసా కాకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులుగా గుర్తించాలి. ఈజీఎస్ పథకంలో కూలీలు 60 సంవత్సరాల వయసు దాటితే కార్డు కోల్పోతారు. కాబట్టి ఈ పథకంలో ఈజీఎస్ నిబంధన విధించకుండా అమలు చేయాలి. 

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విధివిధానాలు ప్రకటించాలి. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం చెప్పింది. కానీ లబ్ధిదారుల ఎంపిక  విధివిధానాలు విడుదల చేయలేదు. సిద్దిపేట జిల్లాలో 68 వేల దరఖాస్తులు వచ్చాయి. డోర్ టు డోర్ సర్వేలో మిగిలిన ఇళ్లను జిల్లా ఇంచార్జ్ మంత్రి ఫైనల్ చేస్తారు అని పత్రికల్లో వార్తలు వచ్చాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసేది. అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగాలంటే గ్రామసభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరై అయిన వారు  కొంత నిర్మించుకొని ఉన్నారు. ఇలాంటి ఇళ్లను పూర్తి చేసుకోడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం. అందరూ పేదవారే కాబట్టి వెంటనే నిధులు విడుదల చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలి.." అని హరీష్‌ రావు డిమాండ్ చేశారు.

Also Read: Kingfisher Beers: మందుబాబులకు షాక్, ఇకపై కింగ్ ఫిషర్ బీర్లకు బ్రేక్

Also Read: CM Revanth Reddy: నేడు విదేశీ పర్యటనకు  సీఎం రేవంత్ రెడ్డి..  తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News