Former CM KCR: టార్గెట్ కడియం.. రంగంలోకి దిగిన కేసీఆర్ స్పెషల్ టీం ..

Former CM KCR: మాజీ సీఎం కేసీఆర్ తనదైన స్టైల్ లో రాజకీయాల్లో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా.. ఆయన వరంగల్ లోక్ సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎలాగైన కడియం కావ్యను ఓడించేలా.. వరంగల్ లో ప్రత్యేకంగా నియోజక వర్గాలకు ఇన్ చార్జీలను నియమించారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Apr 16, 2024, 05:05 PM IST
  • వరంగల్ స్థానంపై గులాబీబాస్ స్పెషల్ ఫోకస్..
  • కొత్తగా ఇన్ చార్జీల నియామకం..
Former CM KCR: టార్గెట్ కడియం.. రంగంలోకి దిగిన కేసీఆర్ స్పెషల్ టీం ..

Former CM KCR Focuses On Warangal MP Seat: గులాబీ బాస్ మరోసారి తనదైన స్టైల్ లో పావులుకదుపుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన వారికి బుద్ధి చెప్పేలా ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ వరంగల్ స్థానానికి మారెపల్లి సుధీర్ కుమార్ ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్.. కడియం శ్రీహరి, కే కేశవరావులు పార్టీని వదిలి పెట్టి పోవడం పట్ల ఎంతో మనో వేదనకు గురైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. పదవులు, అధికారం, హోదాలను అనుభవించి తీరా పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీని వదిలిపెట్టి పోవడంపై ఆయన సీరియస్ అయినట్లు సమాచారం. వరంగల్ స్థానానికి ఒకప్పుడు తాటికొండ రాజయ్యను కాదని కడియంకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. పార్టీలో ఉన్నతమైన పదవులు, హోదా, గౌరవం ఇచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం లోక్ సభకు కడియం చెప్పగానే.. కడియం కావ్యకు బీఆర్ఎస్ టికెన్ ను కేటాయించారు. బీఆర్ఎస్ లో ఆయనకు మాటకు ఎంతో గౌరవం ఇచ్చారు. అయిన కూడా కడియం పార్టీని వదిలిపోవడం పట్ల కేసీఆర్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. 

Read More: Manthani Police Station: పోలీస్ స్టేషన్ లో డ్యాన్స్‌తో రెచ్చిపోయిన జెడ్పీటీసీ భర్త.. వీడియో వైరల్..
 
ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు కావడం, మరోవైపున పార్టీలో ఎంతో గౌరవం ఇచ్చి,  చూసుకున్న నాయకులు వరుసగా బైటకు వెళ్లడం గులాబీ బాస్ కు ఒకింత బాధపేట్టే అంశంగానే చెప్పుకొవచ్చు. ఇక పార్టీని వదిలి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు.. దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలని కూడా బీఆర్ఎస్ లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఇదిలా ఉండగా.. వరంగల్ నియోజక వర్గానికి గులాబీబాస్ ఏడుగురిని ప్రత్యేకంగా ఇన్ చార్జీలుగా నియమించారు. పరకాలకు బండ్ల ప్రకాశ్, పాలకుర్తి కి సిరికోండ మధుసూదన చారీ, ఎర్రబల్లీ దయాకర్ రావు, స్టేషన్ ఘన్ పూర్ కు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాటికొండ రాజయ్య, వరంగల్ వెస్ట్ మర్రియాదవ్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వర్ధన్న పేటకు కె వాసుదేవ రెడ్డి, భూపాలపల్లికి పద్మారాజు సారయ్యలను నియమించారు.

Read More: Akbaruddin Owaisi: మమల్ని చంపాలని చూస్తున్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్..

ఎలాగైన కడియం కావ్యను ఓడించడంకోసం గులాబీబాస్ ప్రత్యేకంగా మీటింగ్ లను నిర్వహిస్తున్నారు. అక్కడి నేతలతో నిరంతరం టచ్ లో ఉంటున్నారు. కేటీఆర్ సైతం ప్రత్యేంకంగా పార్టీలు మారిన వారిని ఓడించడమే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్  తెలంగాణలో లోక్ సభలో ఎక్కువ స్థానాలు గెలిచి ప్రజల్లో తమపై ఆదరణ తగ్గలేదని చూపించాలనుకుంటున్నారు. తెలంగాణలో అనేక పథకాలు, హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను ఎన్నికల ప్రచారంలో ఎండగడుతూ బీఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తుంది. బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయన నేతలను, మరోసారి పార్టీలోకి రానిచ్చేది లేదనికూడా గులాబీ నేతలు ఇప్పటికే పలుమార్లు క్లియర్ గా చెప్పేశారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News