Good news to VRAs: వీఆర్ఏలకు గుడ్ న్యూస్.. ఇకపై శాఖసింధి వ్యవస్థ రద్ధు

Good news to VRAs, VRAs are now Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ఇటీవలే కాలం చెల్లిన వీఆర్వో వ్యవస్థను రద్దు చేసుకున్నామని, రైతుల కల్లాల కాడ ఇచ్చింది తీసుకుంటూ.. గ్రామ సేవ చేసిన నాటి భూస్వామ్య కాలపు అవశేషమైన వీఆర్ఏ వృత్తి విధానాన్ని రద్దు చేసుకొన్నామన్నారు. వారికి పే స్కేలు కల్పించి వారిని ప్రభుత్వ  ఉద్యోగులుగా పర్మినెంట్ చేశామని సీఎం అన్నారు.

Written by - Pavan | Last Updated : Jul 25, 2023, 12:40 PM IST
Good news to VRAs: వీఆర్ఏలకు గుడ్ న్యూస్.. ఇకపై శాఖసింధి వ్యవస్థ రద్ధు

Good news to VRAs, VRAs are now Govt Employees: తాత ముత్తాతల కాలం నుంచి గ్రామాల్లో సహాయకులుగా పనిచేస్తున్న వీఆర్ఏలకు పే స్కేలు అమలు పరుస్తూ, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ ఆదివారం నాడు తాను ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం సచివాలయంలో అందుకు సంబంధించిన జీ.వో కాపీని వీఆర్ఏ జేఏసీ నేతలకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉత్తర్వులు అందుకున్న వీఆర్ఏలు బాగోద్వేగానికి లోనయ్యారు. అరకొర జీతాలతో చాలీ చాలని పరిస్థితుల్లో ఇన్నాళ్లూ మగ్గిపోయిన తమ జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తరతరాలుగా తమను ఏనాడూ, ఎవరూ పట్టించుకోకపోవడంతో వివక్షకు గురయిన తమ వంటి కింది స్థాయి సేవకుల కోసం మానవీయ కోణంలో ఆలోచన చేసిన మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని వీఆర్ఎలు కొనియాడారు. తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి, తమ జీవితాలను తీర్చిదిద్దేందుకు గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కృషి చేసిన మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావును ‘‘లాంగ్ లివ్ కేటీఆర్’’ అంటూ వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

తమ జీవితాల్లో తమ భవిష్యత్తు తరాలకు దారిదీపమై నిలిచిన సిఎం కేసీఆర్ ను త్వరలోనే యావత్ వీఆర్ఏ కుటుంబాలతో లక్షలాదిగా భారీ సభను ఏర్పాటు చేసి తమ కృతజ్జతను ప్రకటించుకుంటామని వీఆర్ఎ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. సోమవారం నాడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉత్తర్వులు అందుకున్న వారిలో వీఆర్ఏ జేఏసీ నేతలు చైర్మన్ రాజయ్య, కో చైర్మన్ రమేశ్ బహదూర్, సెక్రటరీ జెనరల్ దాడే మీయా, విజయ్, రవి, శ్రీధర్ సహా పెద్ద ఎత్తున వీఆర్ఏలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తున్నదన్నారు. ఇటీవలే కాలం చెల్లిన వీఆర్వో వ్యవస్థను రద్దు చేసుకున్నామని, రైతుల కల్లాల కాడ ఇచ్చింది తీసుకుంటూ.. గ్రామ సేవ చేసిన నాటి భూస్వామ్య కాలపు అవశేషమైన వీఆర్ఏ వృత్తి విధానాన్ని రద్దు చేసుకొన్నామన్నారు. వారికి పే స్కేలు కల్పించి వారిని ప్రభుత్వ  ఉద్యోగులుగా పర్మినెంట్ చేశామని సీఎం అన్నారు. సమాజసేవలో భాగస్వాములైన కిందిస్థాయి వృత్తులు ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ కర్తవ్యమని, వారికి సాధికారత కల్పించి, సగౌరవంగా ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలిచేలా చేయడమే తమ ధ్యేయమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా.. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... ‘‘ ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటకంగా తాత ముత్తాల కాలం నుండి విఆర్ఏ వ్యవస్థ కొనసాగింది. గ్రామాల్లో తరతరాలుగా అతి తక్కువ జీతంతో రైతుల కల్లాల దగ్గర దానం అడుక్కునే పద్ధతిలో తాతలు, తండ్రులు పనిచేస్తూ వచ్చారు. ఇటువంటి విధానం సరియైంది కాదని భావించి వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసుకున్నాం,.’’ అని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో కూడా చాలా తక్కువ జీతంతోని విఆర్ఎలు పనిచేస్తున్నారని మహారాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. విఆర్ఎల క్రమబద్ధీకరణను మరాఠా నేతలు అభినందిస్తున్నారని సీఎం అన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టనున్న విఆర్ఎలందరికీ సీఎం శుభాభినందనలు తెలిపారు. 

ఈ సందర్భంగా వీఆర్ఏల సర్ధుబాటు గురించి సిఎం కేసీఆర్ వివరించారు. 10వ తరగతి అర్హత కలిగిన వారు 10,317 మందిని నీటిపారుదల, మిషన్ భగీరథ విభాగాల్లో పనిచేస్తారని, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన 2,761 మంది రికార్డు అసిస్టెంట్ హోదాతో, డిగ్రీ ఆ పై విద్యార్హత కలిగిన 3,680 మంది జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తారని సీఎం స్పష్టం చేశారు. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఈ పోస్టులకు అప్రూవల్ ఇచ్చిందన్నారు.
 
61 సంవత్సరాలు దాటిన మరో కేటగిరీలో 3,797 మంది వీఆర్ఏలుగా పనిచేస్తున్నారని, వారు ఇంత కాలం సమాజానికి చేసిన సేవకుగాను, మానవీయ కోణంలో ఆలోచించి వారి వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలిస్తామన్నారు. వారి వారసుల విద్యార్హతలను అనుసరించి నిబంధనల మేరకు మిగిలిన వారి మాదిరిగానే ఉద్యోగాలిస్తామని సీఎం స్పష్టం చేశారు. విఆర్ఎల జెఎసి ఎంత తొందరగా లిస్ట్ ఇస్తే అంత తొందరగా వారికి ఆర్డర్స్ ఇస్తామని, ఈ ఆర్డర్‌లోనే ఆ విషయాలను పొందుపరిచినట్లు సీఎం తెలిపారు.  “వారు వారి పిల్లలను తీసుకొని వస్తే వారి విద్యార్హతలను బట్టి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుంది. విఆర్ఎలు ఇక నుంచి పే స్కేల్ ఉద్యోగులు” అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి : Good News to VRAs: వీఆర్ఏలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కారు
మీరందరూ ఆయా శాఖల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, ఉద్యోగాల్లో చేరిన తర్వాత కూడా చదువు ఆపకుండా ఇంకా చదివి ప్రమోషన్లు కూడా తెచ్చుకోవాలని సీఎం వారికి సూచించారు. ఈ ప్రక్రియ తొందరగా పూర్తయ్యేలా, మీ దగ్గరకు చేరేలా చొరవ తీసుకున్న మంత్రి కేటిఆర్ జన్మదినం సందర్భంగా ఈ రోజు ఉత్తర్వులిస్తే ఇస్తే బాగుంటందనే విఆర్ఎల కోరిక మేరకు.., సోమవారం రోజే ఉత్తర్వులు వచ్చే విధంగా కృషి చేశారని అందుకు సీఎస్ శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌ను సిఎం కేసీఆర్ అభినందించారు. అత్యంత పీఠముడులతో కూడుకున్న వీఆర్ఏల క్రమబద్దీకరణ సర్దుబాటు విషయాన్ని అత్యంత బాధ్యతాయుతంగా కొలిక్కి తీసుకువచ్చారని  అధికారులను సిఎం కేసీఆర్ అభినందించారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎలాంటి లీగల్ సమస్యలు తలెత్తకుండా జీవోను రూపొందించినందుకు వారికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి : Telangana VRAs: ఇప్పుడే మాకు అసలైన పండగ : వీఆర్ఏ జేఏసీ ప్రతినిధులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News