Wanaparthy Farmers Protest: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు కొత్త పేరు పెట్టారు. అన్ని పథకాలను.. హామీలను ఎగవేస్తుండడంతో ఎగవేతల రెడ్డి అంటూ ఎమ్మెల్యే హరీశ్ రావు నామకరణం చేశారు. వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన మాటలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. రైతుల కోసం ఎందాకైనా కొట్లాడుతామని ప్రకటించారు.
Also Read: KTR Celebrations: దీపావళి వేళ సంబరాలకు కేటీఆర్ పిలుపు.. ఎందుకు? ఏం సాధించారో తెలుసా?
రైతులకు రుణమాఫీ, రైతుబంధు ఇవ్వకుండా మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వనపర్తిలో రైతాంగ, ప్రజా నిరసన సదస్సు నిర్వహించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'రేవంత్ రెడ్డి పాలనలో కొత్త పథకాలు రాలేదు, ఉన్న పథకాలు బంద్ పెడుతున్నడు. బతుకమ్మ చీరలు లేవు, కేసీఆర్ కిట్లు లేవు, చెరువుల్లో చేప పిల్లలు లేవు' అని తెలిపారు.
Also Read: Hyderabad: అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్.. వడివడిగా అభివృద్ధి పనులు
'బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రమైనా చేస్తున్నారు. వరంగల్ డిక్లరేషన్‌లో అనేక హామీలు ఇచ్చారు. ఒక్కటైనా అమలు అవుతుందా?' అని హరీశ్ రావు ప్రశ్నించారు. 'అయితే దేవుడి మీద ఒట్లు అడిగితే తిట్లు. తిట్లతో పాటు కేసులు కూడా ఉన్నాయి' అని చెప్పారు. 'తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ, చంద్రబాబు, వైఎస్ మీద పోరాటం చేసినోళ్లం' అని గుర్తు చేశారు. రుణమాఫీ లోక్‌సభ ఎన్నికల్లో పంద్రాగస్టు వరకు చేస్తామని చెప్పి మాట తప్పారు. ఈయన చెబితే నమ్మరని దేవుళ్ల మీద ఒట్లు వేసిండు. కురుమూర్తి, జోగులాంబ, లక్ష్మి నరసింహ స్వామి మీద ఒట్లు వేసి మాట తప్పారు' అని వివరించారు.
ఇప్పటివరకు సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. కేసీఆర్ అందరికీ రైతుబంధు ఇస్తే నిబంధనలు పెట్టి రుణమాఫీ ఎగవేశారు' అని హరీశ్ రావు విమర్శించారు. పాలకుడు దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మాట తప్పితే రాష్ట్రానికి అరిష్టం అవుతుందని నేను దేవుడి దగ్గరకి వెళ్లాను. ప్రజలను కాపాడు.. పాపాత్ముడిని క్షమించు అని వేడుకున్నా' అని వివరించారు. దానికి కూడా నా మీద కేసులు పెట్టారని చెప్పారు.
'మోసం చేసిన అతడి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి' అని హరీశ్ రావు నామకరణం చేశారు. 'పది నెలలైనా మ్యానిఫెస్టోలో చెప్పినవి అమలు చేయలేదని ప్రశ్నిస్తే బేగం బజార్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టారు' అని తెలిపారు. 'బిడ్డా రేవంత్ రెడ్డి! నువ్వు నా మీద ఎన్ని కేసులు పెట్టినా నీ హామీలు అమలు చేసేదాకా నిన్ను ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తా. బేగం బజార్ కాదు ఏ బజార్‌లో కేసులు పెట్టుకుంటవో పెట్టుకో' అని సవాల్ విసిరారు.
మూసీ పేరిట రూ. లక్షా 50 వేల కోట్లు అంటున్నాడు. కానీ రైతులకు రైతుబంధు ఇచ్చేది లేదని చెబుతున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. రైతుబంధు ఇవ్వాలంటే ఊకుందామా ఉరికిద్దామా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుబంధు, రుణమాఫీ, బీమా పేరిట రూ.లక్షా 50 కోట్లు కేసీఆర్ రైతులకు ఇస్తే.. రేవంత్ రెడ్డి రుణమాఫీ అని చెప్పి పచ్చి మోసం చేసిండు' అని తెలిపారు.
రేవంత్ రెడ్డి ఎవరినీ నమ్మడం లేదు. పోలీసోళ్లను కూడా నమ్మడం లేదు. సీఎంగా సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ఫెయిలయ్యారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని మేం కోట్లాడితే పెంచలేదు. ఇది బీఆర్ఎస్ పోరాటం వల్లనే సాధ్యమైంది' అని ప్రకటించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ మెడలు వంచి రైతుబంధు ఇప్పిస్తానని సంచలన ప్రకటన చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదని.. రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook