Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏకకాలంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు హెచ్చరిక జారీ అయింది. వచ్చే నాలుగు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచిస్తోంది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుండటంతో పాటు ఉపరితల ఆవర్తనం ఇప్పటికే ఆవహించి ఉండటం, నైరుతి రుతు పవనాలు బలపడటంతో తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రలోని వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం జూలై 26 నాటికి వాయుగుండంగా మారనుంది. ఫలితంగా ఇవాళ్టి నుంచి వరుసగా నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. రేపు హైదరాబాద్ నగరంలో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.
ఇక రేపు అంటే జూలై 25న మహబుూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్ధిపేట ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. అటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడనున్నాయి.
మొత్తానికి ఈ నెల 25, 26, 27, 28 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక నేపధ్యంలో రెడ్ అలర్ట్ జారీ అయింది. ఈ నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో రేపు చాలా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
ఇవాళ అంటే జూలై 24వ తేదీన ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగావ్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. రాజన్న సిరిసిల్ల, కరీంగర్, పెద్దపల్లి, హనుమకొండ, వరంగల్, భద్రాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు.
రేపు జూలై 25వ తేదీన హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో అతి తీవ్ర వర్షాలు పడనున్నాయి. సిద్దిపేట, జనగావ్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు.
ఎల్లుండి జూలై 26వ తేదీన నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి తీవ్ర వర్షాలు పడనున్నాయి. ఇక సిద్దిపేట, కరీంనగర్, జనగావ్, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, వరంగల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.
ఇక జూలై 27 వతేదీన కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి తీవ్ర వర్షాలు పడనున్నాయి. సిద్దిపేట, జనగావ్, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
Also read: YS Sharmila: ప్రజలకు చిప్ప చేతిలో పెడుతున్నడు.. సీఎం కేసీఆర్‌పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook