Hyderabad Rain: భాగ్యనగరంలో ఈదురుగాలుల బీభత్సం..కార్లు ధ్వంసం..!

Hyderabad Rain: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం వేళ పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 06:41 PM IST
  • హైదరాబాద్‌లో మారిన వాతావరణం
  • ఈదురుగాలులతో కూడిన వర్షం
  • కార్లు ధ్వంసం, ఇద్దరికి గాయాలు
Hyderabad Rain: భాగ్యనగరంలో ఈదురుగాలుల బీభత్సం..కార్లు ధ్వంసం..!

Hyderabad Rain: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం వేళ పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడ్డ నగరవాసులు ఉపశమనం పొందారు. గచ్చిబౌలి, జీడిమెట్ల, షాపూర్‌నగర్, సూరారం, సుచిత్ర, కుత్బుల్లాపూర్‌, కొంపల్లి, చంపాపేట, సరూర్ నగర్, కర్మన్ ఘాట్, అంబర్‌పేట్‌, సైదాబాద్‌, బంజారాహిల్స్, సోమాజిగూడ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. 

భారీ ఈదురుగాలులకు నాంపల్లిలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలోని భవనం నుంచి ఇనుప రేకులు ఎగిరిపడ్డాయి. అటు వైపు వెళ్తున్న వాహనాలపై పడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. మూడు కార్లు ధ్వంసమయ్యాయి. ఇటు మియాపూర్, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, చందానగర్, దుండిగల్‌లోనూ ఉరుములతో కూడిన వర్షం పడింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో వడగండ్ల వర్షం కురిసింది. బోయిన్‌పల్లి, ఆల్వాల్, తిరుమలగిరి, చిలకలగూడ, మారేడుపల్లి, బేగంపేట్‌, పార్యడైజ్, ప్యాట్నీ సెంటర్‌ ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.  

మరోవైపు నగరంలో వర్షం కురవడంతో ప్రధాని మోదీ టూర్‌కు సైతం అంతరాయం ఏర్పడింది. నైరుతి రుతు పవనాల రాక కారణంగానే వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణలో రానున్న రెండురోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు..అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని చోట్ల ముందుకు కదులుతున్నాయని పేర్కొంది. మరోవైపు ఉపరిత ద్రోణి సైతం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఇంటీరియల్ కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని తెలిపింది.
 

Also read:Revanth Reddy: మోదీ ప్రసంగంలో అధికార దాహం తప్ప హితం లేదు..రేవంత్ నిప్పులు..!

Also read:Trs Counter: మంటపుట్టించిన ప్రధాని వ్యాఖ్యలు, భగ్గుమంటున్న గులాబీ నేతలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News