ప్రభాస్ గెస్ట్ హౌజ్ సీజ్: హైకోర్టులో ప్రభాస్ పిటిషన్‌పై విచారణ

హైకోర్టులో ప్రభాస్ పిటిషన్‌పై విచారణ

Last Updated : Dec 21, 2018, 01:30 PM IST
ప్రభాస్ గెస్ట్ హౌజ్ సీజ్: హైకోర్టులో ప్రభాస్ పిటిషన్‌పై విచారణ

హైదరాబాద్: రాయదుర్గంలోని పాన్ మక్తా గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 46లో వున్న 84 ఎకరాల 30 గుంటల స్థలంలో ప్రభాస్ కి వున్న గెస్ట్ హౌజ్‌ని అక్కడి స్థానిక రెవిన్యూ అధికారులు ఇటీవల సీజ్ చేసిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా వివాదంలో వున్న ఈ స్థలం ప్రభుత్వానిదేనంటూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వాసుచంద్ర ఆ స్థలంలోని నిర్మాణాలను అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ వాటిని తొలగించి, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో భాగంగానే అదే స్థలంలో వున్న ప్రభాస్‌ గెస్ట్ హౌజ్‌ను సైతం సీజ్‌ చేశారు. 

ఇదిలావుంటే, తనకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అధికారులు ఇంటిని ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నిస్తూ ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ప్రస్తుతం యథాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ పిటిషన్ తదుపరి విచారణను డిసెంబర్ 31కి వాయిదా వేసింది. అంతేకాకుండా ఈ పిటిషన్‌పై 24న కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.

Trending News