How to Vote on Ballot Paper | జీహెచ్ఎంసి ఎన్నికలు డిసెంబర్ 1న జరపడానికి సర్వం సిద్ధం అయింది. ఓటర్లు తమ ప్రజాప్రతినిధిని ఎంచుకోవడానికి సిద్ధం అయ్యారు. ఈ ఎన్నికలు ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించనున్నారు.
అయితే ఈవీఎంలో (EVM) ఒక్క బటన్ నొక్కి ఓటు వేయడానికి అలవాటు పడిన ప్రజలు బ్యాలెట్ ( Ballot Papers ) ద్వారా ఓటు వేయడం ఎలా అని ఆలోచిస్తున్నారు.
అలాంటి వారి కోసం బ్యాలెట్ ఓటింగ్ విధానం గురించి తెలియజేస్తున్నాం | Process of Ballet Voting
1. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల కమిషషన్ తెలిపిన ఐడీకార్డులో ఏదో ఒకదాన్ని చూపించాలి. అప్పుడు ఓటు వేయడానికి అనుమతి లభిస్తుంది.
Also Read | GHMC Elections 2020: ఓటరు కార్డు లేకున్నా ఈ ఐడీ కార్డులు చూపించి ఓటేయవచ్చు
2. ప్రిసీడింగ్ ఆఫిసర్ వద్ద మీ పేరు లిస్ట్‌లో ఉందో లేదో చెక్ చేసి చెబుతారు.
3. తరువాత మీ ఎడమ చేతి వేలికి ఇంక్ వేస్తారు.
Also Read | GHMC App లో పోలింగ్ సెంటర్, బూత్ వివరాలు సులభంగా తెలుసుకోండి!
4. మరో అధికారి మీకు బ్యాలెట్ పేపర్, స్వస్తిక్ గుర్తు ఉన్న రబ్బరు స్టాంపు అందేజేస్తారు. అందులో అభ్యర్థుల వివరాలు ఉంటాయి.
5. అనంతరం మీరు ఒక చిన్నపాటి క్యాబిన్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.
6. అక్కడ మీరు అనుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగతా రబ్బరు స్టాంపుతో ముద్రవేయాల్సి ఉంటుంది.
7.ఈ బ్యాలెట్ పేపర్‌ను ఎన్నికల అధికారి (Election Officers) సూచనల మేరకు బ్యాలెట్ బాక్సులో వేయాలి.
Also Read | TRS Manifesto: టీఆర్ఎస్ హెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల, కీలక అంశాలివే
Also Read | BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టోపై నెటిజెన్లు ఎలా రియాక్ట్ అయ్యారంటే..
8. మీ ఓటు అక్కడ నమోదు అయిపోతుంది.
9.అభ్యర్థి పేరు పక్కన కాకుండా.. ఇద్దరు అభ్యర్థుల మధ్య, లేదా మరో చోట రబ్బరు స్టాంపుతో ఓటు వేస్తే ఆ ఓటు చెల్లదు.
10.ప్రశాంతంగా అన్ని నియమాలు తెలుసుకుని ఓటు వేసి ఓటరుగా మీ బాధ్యత పూర్తి చేసుకుని గర్వంగా బయటికి రావచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe