బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్ నేత రేవంత్ ఇంట్లో ఐటీ దాడులు

                     

Last Updated : Sep 27, 2018, 12:37 PM IST
బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్ నేత రేవంత్ ఇంట్లో ఐటీ దాడులు

హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఐటీ అధికారులు ఊహించని షాక్ ఇచ్చిచారు. ప్రముఖ మీడియా కథనం ప్రచారం ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్ తోని రేవంత్ ఇంటిపై ఉదయం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో పాటు ఆయన స్వస్థలం కొడంగల్‌లోని ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. 

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన రేవంత్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని రాత్రికి నేరుగా కొడంగల్‌ చేరుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రస్తుతం పనివారు తప్ప కుటుంబసభ్యులెవరూ లేరు. అయినప్పటికీ  ఐటీ బృందంలో ఆ ఇంటిలో సోదాలు నిర్వహించడం గమనార్హం.

మూడున్నరేళ్లక్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగానేనని తెలుస్తోంది. అప్పట్లో రేవంత్ రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయమై జరుపుతున్న విచారణలో భాగంగానే దాడులు చేస్తున్నట్టు సమాచారం

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా భాద్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి ఈ రోజు కొడంగల్‌ నుంచి రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రచారం ప్రారంభానికి సర్వసిద్ధం చేసుకున్న తరుణంలో  ఐటీ దాడులు జరగడం కలకలం రేపింది. దీనిపై  రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది దానిపై ఉత్కంఠత నెలకొంది. కాగా ఇది ముమ్మాటికి రాజకీయ కక్షేనని పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

Trending News