హైదరాబాద్: సర్కారు తుమ్మతో ఆనవాళ్లు కోల్పోయిన కాకతీయ కాలువల్లో Kaleshwaram Project ద్వారా ప్రాణహిత పరవళ్లు తొక్కుతున్నదని, చరిత్రలో తొలిసారి శ్రీరాంసాగర్ పూర్తి ఆయకట్టుకు నీరు అందుతోందని ఈ ప్రాంత రైతాంగం ఆనందంలో మునిగిపోతోందని రాష్ట్ర తెరాస పేర్కొంది. కాళేశ్వరం నీటితో 2,138 చెరువులు నిండాయని, పద్నాలుగు జిల్లాలో సిరుల పంటలు పండుతున్నాయని, సాగునీటి ప్రాజెక్టులు, రైతన్నలకు ఆర్థికసాయంతో వస్తున్న సత్ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. అనూహ్యవృద్ధిని సాధిస్తున్న వ్యవసాయరంగం, పాడి పంటలతో తెలంగాణ పల్లెలు మురిసిపోతున్నాయని అన్నారు.
Also Read: ఎంపీ బండి సంజయ్ చేతికి అందుకే తెలంగాణ బీజేపి పగ్గాలు ఇచ్చారా ?
ప్రాణహిత నీరు, కాళేశ్వరం దగ్గర సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తు నుండి త్వరలో 618 మీటర్ల ఎత్తు ఉన్న కొండపోచమ్మ సాగర రిజర్వాయర్లోకి చేరనున్నాయని, ఈ నీళ్ళ కోసమే అరవై ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడ్డామని అనేక త్యాగాల అనంతరం తెలంగాణ పచ్చబడుతోందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం... అన్నపూర్ణ (అనంతగిరి) రిజర్వాయర్ కు నీటి ఎత్తిపోతల ట్రయల్ రన్ దిగ్విజయం
Trail run of Kaleshwaram Project Link - 4 of Annapurna (Ananthagiri) Pump House is a successful.#KaleshwaramProject pic.twitter.com/9rLRgxPboG
— TRS Party (@trspartyonline) March 11, 2020
Read Also:ఎన్ఆర్ఐ, విదేశీ భక్తులకు టీటీడీ స్పెషల్ రిక్వెస్ట్
అన్నపూర్ణ రిజర్వాయర్ కు నీళ్ళు ఎత్తిపోసే మోటార్ ట్రయల్ రన్ విజయవంతం అయ్యిందని, దాదాపు రెండువందల కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం ఒక నది నీటిని ముప్ఫై అంతస్తుల ఎత్తుకు (101 మీటర్లు) ఎత్తి రిజర్వాయర్లో పోస్తున్న సుందర దృశ్యం ప్రతి ఒక్కరిని మైమరిపింపజేస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..