Padi Kaushik Reddy Bail: కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన దాడి వ్యవహారంలో అరెస్టయిన బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ ఊరట లభించింది. అతడికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయడంతో కౌశిక్ రెడ్డి జైలుకు వెళ్లకుండానే విడుదలయ్యారు. విడుదలైన అనంతరం కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాజకీయాలు తాను మాట్లాడదలచుకోలేదని.. తర్వాత విషయాలు వెల్లడిస్తానని ప్రకటించారు.
Also Read: Padi Kaushik Reddy: తెలంగాణలో 'అరెస్ట్‌ల సంక్రాంతి'.. రణరంగంగా 'పండుగ'
కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 'ఏ పార్టీ' అని ప్రశ్నించడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ అసభ్య పదజాలం వాడడంతోపాటు దాడికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో కౌశిక్ రెడ్డిపై నెపం నెట్టేయడంతో అతడిపై కేసు నమోదు చేయడం.. అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కరీంనగర్ ఒకటో పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ఇక నుంచి ఆ కష్టాలకు చెక్
హైదరాబాద్‌లో కరీంనగర్ పోలీసులు భోగి పండుగ రోజు సోమవారం కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసి తరలించారు. మంగళవారం వైద్య పరీక్షల అనంతరం కరీంనగర్ సెకండ్ అడిషనల్ జ్యూడీషియల్ జడ్జ్ ప్రేమలత ముందు పోలీసులు హాజరుపర్చారు. అన్ని కూడా బెయిలబుల్ సెక్షన్లు కావడంతో రిమాండ్ రిపోర్ట్ కొట్టివేశారు. బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. బెయిల్‌పై విడుదలైన అనంతరం కౌశిక్ మీడియాతో మాట్లాడారు. 'ఇది హైడ్రామా. ఈ హైడ్రామాలో నాకు మద్దతు తెలిపిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితతో పాటు అందరికీ ధన్యవాదాలు. పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దనుకుంటున్నా. రేపు హైదరాబాద్‌లో పూర్తి వివరాలు వెల్లడిస్తా. కోర్టు ప్రక్రియ ప్రకారం ఏ రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి కూడా నిబంధనలు అడ్డువస్తున్నాయి. అర్థం చేసుకోగలరు' అని పేర్కొన్నారు.
ప్రశ్నిస్తే అరెస్ట్‌లా?
న్యాయమూర్తి ఎదుట హాజరపర్చేందుకు తీసుకెళ్తున్న సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలీస్ వాహనంలో నుంచి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఎన్ని కేసులు పెట్టిన అరెస్టులకు భయపడం. రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటాం. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారు' అని పేర్కొన్నారు. పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ సెకండ్ అడిషనల్ జ్యూడీషియల్ జడ్జ్ ప్రేమలత ముందు పోలీసులు హాజరుపర్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.