Khairatabad Ganesh Visarjan: దేశంలోనే అతిపెద్ద వినాయకుడు గంగ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది. 11 రోజులపాటు పూజలు అందుకున్న మహా గణపతి నిమజ్జనానికి రంగం సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనానికి తరలి వెళ్లనున్నాడు. మహా శోభాయాత్రతో హైదరాబాద్ భక్తులతో కిటకిటలాడనుంది. అయితే ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జన శోభాయాత్ర ఎప్పుడు ఉంటుందా? అనేది భక్తుల అందరికీ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మహా గణపతి నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షల సంఖ్యలో హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మహా గణపతి నిమజ్జన షెడ్యూల్ ఇలా ఉంది.
Also Read: Balapur Laddu: బాలాపూర్ లడ్డూ గెలిస్తే కొంగు బంగారమే! వేలం విజేతల జాబితా ఇదే!
హైదరాబాద్ ఖైరతాబాద్‌లో కొలువుదీరిన సప్తముఖ గణనాథుడు 11 రోజులు ప్రత్యేక పూజలు అందుకున్నాడు. దాదాపు 13 నుంచి 15 లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారని సమాచారం. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ గణేశుడిని దర్శించుకున్నారు. విశేష పూజలు పొందిన గణనాథుడు మంగళవారం గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. నిమజ్జన యాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం నిలిపివేశారు. మహా గణపతి కర్ర తొలగింపు పనులు, వెల్డింగ్ పనులు కొనసాగుతుండడంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా భక్తుల దర్శనాలు నిలిపివేశారు.
Also Read: Balapur Laddu: వేలంలో పాల్గొనేవారికి భారీ షాక్.. బాలాపూర్ లడ్డూ ...
షెడ్యూల్ ఇదే
- సోమవారం సాయంత్రం వినాయకుడిని ముందుకు కదిలిస్తారు.
- మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రత్యేక పూజలు జరుగుతాయి.
- మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో మహా గణపతి శోభాయాత్ర ప్రారంభం.
- శోభయాత్ర ప్రారంభమై ఖైరతాబాద్ సెన్సేషన్ సన్‌షైన్ థియేటర్, వాసవి భవనం, టెలిఫోన్ భవన్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ గుండా శోభయాత్ర కొనసాగుతుంది.
- మధ్యాహ్నం 1 గంటలకు ఎన్టీఆర్ ఘాట్ ఎదురుగా హుస్సేన్‌సాగర్ వద్ద ఉన్న మహా గణపతి నిమజ్జనం.
- శోభయాత్రలో సాంస్కృతిక కార్యక్రమాలు, కళాబృందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఏర్పాట్లు పరిశీలన..
ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పరిశీలించారు. హుస్సేన్‌సాగర్‌తోపాటు హైదరాబాద్‌లోని జలాశయాల వద్ద 360 క్రేన్లు ఏర్పాటు చేశారు. మొబైల్ క్రేన్లు కూడా అందుబాటులో ఉంచారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్, జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్ తదితర అధికార యంత్రాంగం సమన్వయం చేసుకుని నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంతగా మంగళవారం అర్ధరాత్రి వరకు నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం పని దినం ఉండడంతో ఆలోపు నిమజ్జనం పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళిక అమలు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.