మా ఇలాఖాలో 80 శాతం సీట్లు గెలుస్తాం- కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి సవాల్

                                        

Last Updated : Oct 5, 2018, 06:19 PM IST
మా ఇలాఖాలో 80 శాతం సీట్లు గెలుస్తాం- కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి సవాల్

తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి టీఆర్ఎస్ అధినేతకు సవాల్ విసిరారు. నల్గొండ జిల్లాలోని  12 స్థానాల్లో 10 సీట్లు మహాకూటమి గెలుచుకోవడం ఖామన్నారు. ఒక వేళ అలా జరక్కపోతే తాను గెలిచినా కూడా ఆ స్థానానికి రాజీనామా చేస్తాన్నారు. దమ్మంటే తన సవాల్ స్వీకరించి..టీఆర్ఎస్ ను ఎన్ని స్థానాల్లో గెలిపిస్తారో కేసీఆర్ చెప్పాలన్నారు.  నల్గొండలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ టికెట్లు కేటాయింపు దారుణమన్నారు. దోపిడీదారులు, రౌడీలకే  కేసీఆర్ టికెట్లు ఇచ్చారని...అలాంటి వాళ్లను గెలిపిస్తే జిల్లాలో నిత్యం దోపిడీలు, హత్యలే ఉంటాయని కోమటిరెడ్డి విమర్శించారు.

కోమటిరెడ్డి ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి పై విమర్శలు సంధించారు.  దోచుకోవడానికే దామరచర్ల థర్మల్ ప్లాంట్ ను నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఈ దోపీడి గ్రూప్ కు జగదీష్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్లాంట్ ను మూసివేయిస్తామన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో టీఆర్ఎస్ నేతలు రూ. 30 వేల కోట్లు దోచుకున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. 

Trending News