KTR Vs Revanth Reddy: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులపై తీవ్ర ఆరోపణలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న కేటీఆర్‌పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తొలిసారిగా ఈ ఆరోపణలపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. 'ఈ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు సంబంధం లేదు' అని ప్రకటించారు.
Also Read: Warangal MP Seat: వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై భారీ ట్విస్ట్‌లు.. ఉద్యమకారుడికి కేసీఆర్ అవకాశం
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను కేటీఆర్ తిప్పికొట్టారు. 'నేను ట్యాపింగ్‌కు పాల్పడలేదు. ఒకవేళ పాల్పడినట్టు ఉంటే నిరూపించండి' అని సవాల్ విసిరారు. అంతేకాకుండా తనపై ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలకు కేటీఆర్ సంచలన సవాల్ చేశారు. ఆరోపణలు చేస్తున్న వారిద్దరూ కూడా రండి. వారితోపాటు నేను కూర్చుంటా. లై డిటెక్టర్ పరీక్ష చేయండి' అని ఛాలెంజ్ విసిరారు. 'గన్‌పార్క్, రవీంద్రభారతి లేదా ఏదైనా బహిరంగ ప్రదేశాల్లో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. కానీ వారు కూడా లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం కావాలి' అని తెలిపారు.
Also Read: Harish Rao: చీము నెత్తురు ఉన్నోళ్లు ఎవరూ కాంగ్రెస్, బీజేపీకి ఓటేయరు: హరీశ్ రావు వ్యాఖ్యలు
అంతటితో ఆగకుండా రేవంత్ రెడ్డిపైనే కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. 'మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నాడు' తీవ్ర ఆరోపణలు చేశారు. 'వాళ్లు ట్యాపింగ్ చేయట్లేదు అని నిరూపించడానికి లై డిటెక్టర్ పరీక్షకు సిద్దంగా ఉన్నారా.. నేను సిద్ధం' అని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి ఆరోపణలు తెరపైకి తెస్తున్నారు అని వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేటీఆర్ స్పందిస్తూ.. 'కొన్ని తప్పులు చేశాం. తప్పకుండా మేం సరిదిద్దుకుంటాం' అని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో మరింత కష్టపడి అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 'రేవంత్ రెడ్డి నాలుగు నెలల్లో హామీలు నెరవేర్చలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేం పడగొట్టాం. ఆయన పక్కనే ఖమ్మం, నల్లగొండ బాంబులు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి' అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter