ఎటు చూసినా ‘సంతోష్ బాబు అమర్ రహే’ నినాదాలు

Last Journey Of Santosh Babu | అమరుడైన కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలు సంతోష్ బాబు అమర్ రహే అంటూ దేశభక్తి చాటుతూ జయజయ ద్వానాల నడుమ పూలవర్షం కురిపిస్తున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 18, 2020, 01:33 PM IST
ఎటు చూసినా ‘సంతోష్ బాబు అమర్ రహే’ నినాదాలు

చైనా సైన్యంతో పోరాడుతూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబు (Colonel Santosh Babu) అంతిమ యాత్ర సూర్యాపేట విద్యానగర్‌‌లోని ఆయన ఇంటి నుంచి ప్రారంభమైంది. అధికారులు ఆయన పార్థీవదేహంపై త్రివర్ణ పతాకం ఉంచారు. భారీ సంఖ్యలో తరలివచ్చి సంతోష్ బాబుకు తుది నివాళులు అర్పించారు. సైనిక వందనం సమర్పించిన అనంతరం సంతోష్ బాబు మృతదేహాన్ని అంతిమయాత్ర వాహనంలో ఉంచారు. Colonel Santosh Babu: మిలిటరీ విమానంలో కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం తరలింపు )

అమరుడైన కల్నల్ సంతోష్ బాబు నోట్లో తులసితీర్థం పోస్తుండగా కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ఎంజీ రోడ్డు, శంకర్ విలాస్ సెంటర్, రైతు బజార్, పాత బస్టాండ్, ఆపై కోర్టు జంక్షన్, ఎస్పీ ఆఫీసు మీదుగా కేసారంలోని వారి వ్యవసాయ భూమి వరకు సాగనుంది. ప్రజలు భారీ ఎత్తున అంతిమయాత్ర(Last Journey Of Santosh Babu)లో పాల్గొన్నారు. కల్నల్ సంతోష్ బాబు అమర్ రహే, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండాలతో రోడ్ల మీదకు వచ్చి పూలు చల్లుతూ వీరుడికి తుది నివాళి అర్పిస్తున్నారు.  కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం చూసి కుప్పకూలిన తల్లి, భార్య 

కాగా, కేసారంలోని వ్యవసాయ క్షేత్రంలో సంతోష్ బాబు (Santosh Babu) అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేవలం 50 మందికి మాత్రమే అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి అనుమతిస్తారు. సంతోష్ బాబు కుటుంబ సభ్యులు, సైనికాధికారులు, కొందరు ఉన్నతాధికారులు మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

Trending News