Cable Bridge: హైదరాబాద్ నగరానికే తలమానికంగా కేబుల్ బ్రిడ్జి నిలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యంత సందర్శనీయ స్థలంగా దుర్గం చెరువు మారింది. నగర ప్రజలే కాకుండా దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రజలు ఈ బ్రిడ్జిన్ సందర్శించి వెళ్తున్నారు. అయితే ఈ బ్రిడ్జిపై కొన్ని నిషేదాజ్ఞలు ఉన్నాయి. బ్రిడ్జిపై వాహనాలు నిలిపి ఫొటోలు దిగడం నిషేధం. బర్త్ డే పార్టీలు, ఇతర వేడుకలు చేసుకోవడంపై నిషేధం విధించారు. ఫొటో షూట్ వంటి వాటిని బంద్ చేశారు. అయితే ఆ నిబంధనలను ఎవరైతే ఆదేశించారో వారే ఉల్లంఘించడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. బర్త్ డే వేడుకల్లో ఓ సీఐ పాల్గొనడంతో ప్రజలు అతడి తీరుపై మండిపడుతున్నారు.
Also Read: Online Games: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన విద్యార్థులు.. సొంతింట్లోనే రూ.40 లక్షల ఆభరణాలు చోరీ
కొన్ని నెలల కిందట మాదాపూర్ పోలీసులు 'కేబుల్ బ్రిడ్జిపై బర్త్ పార్టీలతో సహా ఎలాంటి వేడుకలు చేసుకోరాదు. చేసుకుంటే కఠిన చర్యల తీసుకుంటాం' అని ప్రకటన చేశారు. సెక్షన్ 188 ప్రకారం శిక్షార్హులు అని హెచ్చరించారు. అయితే ఆ నిబంధనలను మాదాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న గడ్డం మల్లేశ్ ఉల్లంఘించారు. ఓ పుట్టినరోజు వేడుకలో ఆయన పాల్గొని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. కేబుల్ బ్రిడ్జ్‌పై కేకులు తినిపించుకుంటూ సీఐ కనిపించారు. ఆయన సివిల్ డ్రెస్‌లో ఉన్నారు.
Also Read: Light Beers: తాగుబోతుల పాలిట దేవుడయ్య నువ్వు.. లైట్ బీర్ల 'హీరో'కు ఘన సన్మానం
అయితే ఎవరు వేడుకలు చేసుకోరాదనే నిబంధనలు ఉన్నా స్వయంగా పోలీసులే ఉల్లంఘించడం వివాదాస్పదమవుతోంది. ప్రజలకు ఒక రూల్? పోలీసులకు ఒక రూలా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సీఐ అయితే ప్రభుత్వ నిబంధనలు వర్తించవా అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు ఉండవా? అని అడుగుతున్నారు.
నగరంలో సందర్శనీయ ప్రాంతంగా మారిన కేబుల్ బ్రిడ్జ్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఈ క్రమంలో రోడ్డుపైనే వాహనాలు నిలిపి ఫొటోలు, బర్త్ డే పార్టీలాంటి వేడుకలు చేసుకుంటుండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. దీనికి తోడు ఫొటో షూట్‌లు, రైడ్‌ల పేరిట యువత భయభ్రాంతులకు గురి చేస్తుండడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. బ్రిడ్జిపై వాహనాలు నిలపడం.. మనుషులు నిలబడడం నిషేధం విధించారు. ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ పెట్టడంతో వాటిపై ప్రజలు ఎంతసేపయినా తిరగొచ్చు. కానీ రోడ్డు మీదకు రావడం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినా కూడా సందర్శకులు నిబంధనలు ఉల్లంఘిస్తుండడంతో ప్రమాదాలు, ట్రాఫిక్‌కు అంతరాయం వంటివి చోటుచేసుకుంటున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter