Meerpet Murder case Sensational Turn: మీర్ పేట్ మర్డర్ కేసు మరో మలుపు తిరిగింది. గురుమూర్తికి మరో ముగ్గురు సహాయం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య వెంకట మాధవిని చంపేందుకు భర్త గురుమూర్తికి సహకరించిన ముగ్గురు ఎవరన్నది ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం నుంచి గురుమూర్తిని కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని మీర్ పేట్ మర్డర్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఒక డీఆర్డీఓ సెక్యూరిటీగా పనిచేస్తున్న మాజీ ఆర్మీ గురుమూర్తి తన భార్యను ముక్కలుగా నరికి చంపేశాడు. డెడ్ బాడీని కూడా మాయం చేశాడు. అయితే ఈ మర్డర్ కేవలం గురుమూర్తి మాత్రమే కాదు అతనితో పాటు మరో ముగ్గురు సహకరించినట్లు తాజాగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
అయితే ఈ మర్డర్ కేసులో గురుమూర్తిని రిమాండ్ కు తరలించారు. తాజాగా పోలీసులు మరో ముగ్గురు పేర్లను కూడా ఈ కేసులో చేర్చారు. ఈ ఏడాది జనవరి సంక్రాంతి సమయంలో భార్యను 7 ముక్కలుగా నరికి డెడ్ బాడీని హీటర్లో వేసి ఉడికించిన ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ గురుమూర్తి ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా అత్తమామలతో కలిసి జనవరి 15వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేశాడు.
అయితే ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పర్యవేక్షించిన పోలీసులు మాధవి ఇంట్లోంచి బయటికి వచ్చినట్టు ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో పోలీసులు గురుమూర్తిని విచారించక అసలు విషయం బయటపడింది. అయితే ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అయిన గురుమూర్తి తర్వాత డిఆర్డివోలో సెక్యూరిటీగా పనిచేశాడు. బంధువులలో ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉండడంతో తన భార్యను చంపాడు. బలవంతంగా ఆమెను తోసేయడంతో కిందపడి ప్రాణాలు వదిలేసింది. హీటర్లో వేసి ఆమె డెడ్ బాడీని కరిగించాడు.. బొక్కలు మాంసం, ముద్దాలను సమీపంలోని చెరువులో పారేసినట్టు పోలీసులను విచారణలో తెలిపాడు.
ఇదీ చదవండి: బాబోయ్ మండే ఎండలు.. వేడి వాతావరణం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..
మొదట ఆధారాలు లేక తలలు పట్టుకున్న పోలీసులకు ఆ తర్వాత ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీతో ఆధారాలను గుర్తించారు. తాజాగా గురుమూర్తికి మాధవిని చంపడానికి మరో ముగ్గురు సహకరించడంతో కేసు మరో మలుపు తిరిగింది. దీంతో నిన్నటి నుంచి పోలీసులు తనకు సహకరించింది ఎవరు అనేది గురుమూర్తిని విచారిస్తున్నారు.
అయితే గురుమూర్తి తన భార్య మాధవిని 'సూక్ష్మ దర్శిని' అనే మళయాల క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూసి మర్డర్ చేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అదేవిధంగా గురుమూర్తి కూడా పోలీసులకు చెప్పినట్లు కూడా తెలిసింది. ఈ సినిమాలో హీరోగా బేసిల్ జోసెఫ్ నటించగ... హిరోయిన్‌గా నజిరియా నజీమ్ నటించింది. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది.
ఇదీ చదవండి: బాలీవుడ్' అనే పదం నచ్చదు.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బన్నీ.. క్లారిటీ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.