Saidabad Incident: సైదాబాద్ బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల చెక్ అందించిన మంత్రులు

సైదాబాద్ ఘటన పట్ల తెలంగాణ ప్రభుత్వం బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల చెక్ అందించి ఆర్థికంగా ఆదుకుంది. మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ చిన్నారి తల్లి దండ్రులను కలిసి వారికి దైర్యం చెప్పారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2021, 02:33 PM IST
  • సైబరాబాద్ భాదిత కుటుంబానికి రూ.25 లక్షల చెక్
  • నిందితుడికి శిక్ష పడేలా చూస్తామన్న మంత్రులు
  • అన్ని విధాలా ఆదుకుంటామని గవర్నమెంట్ హామీ!
Saidabad Incident: సైదాబాద్ బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల చెక్ అందించిన మంత్రులు

Saidabad Incident: సైదాబాద్ లో జరిగిన ఆరేళ్ల చిన్నారి హత్య కేసు రోజులు గడుస్తున్న నిందితుడు పట్టుకోలేకపోవటం జనాల్లో తీవ్ర అసహనానికి గురి చేస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ తరపున ఇద్దరు మంత్రులు సైబరాబాద్ కుటుంబాన్ని పరామర్శించారు. 

పోలీసులు ఎంత వెతుకున్న దొరకని నిందితుడిని ఎలా అయిన పట్టుకొని తగిన శిక్ష వేయిస్తామని తెలంగాణ గవర్నమెంట్ తరపున మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ సైబరాబాద్ వెళ్లి భాదిత కుటుంబాన్ని కలిసారు. అంతేకాకుండా అంతేకాకుండా బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల చెక్ ను అందించి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నారు. 

Also Read: September 30 Deadline: సెప్టెంబర్ 30 లోగా ఆ మూడు పనులు తప్పకుండా పూర్తి చేసుకోవల్సిందే

బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ నగరంలోని సైదాబాద్‌లో హత్యకు గురైన ఆరేండ్ల చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి.. తీరని దుఖంలో ఉన్న  వారి కుటుంబాన్ని ఓదార్చారు. 

నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకొని, తగిన శిక్ష విధిస్తామని కుటుంబానికి మంత్రులు హామీ ఇచ్చారు. అంతేకాకుండా 20 లక్షల రూపాయల చెక్ ను అందించారు. వీటితో పాటుగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని తెలిపారు. 

Also Read: Guduputani trailer: గూడుపుఠాణి ట్రైలర్.. విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన Raghu Kunche

ఎన్నో కేసులను అవలీలగా పరిష్కరించిన పోలీసులకు ఈ కేసు సవాల్ గా మారింది. కరుడగట్టిన నేరస్థుల కన్నా తెలివి తేటలు ఉపయోగించి నిందితుడు రాజు తప్పించుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడిపై పోలీసులు రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజు వివరాలు తెలిపిన వారికి వివరాలు గోప్యంగా ఉంచుతామని మరియు వారికి 10 లక్షల రూపాయలు రివార్డు ఇస్తామని... రాజు వివరాలు తెలిస్తే వెంటనే 949061366, 9490616627 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News