MLC Kavitha Vs Bjp Leader Komatireddy Raj Gopal Reddy: బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కవిత పేరు 28 సార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పేపర్ క్లిప్‌ను రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్‌లో షేర్ చేశారు. 'ఛార్జ్‌షీట్‌లో లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు ప్రస్తావించారు..' అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌కు ఎమ్మెల్సీ కవిత రిప్లై ఇస్తూ.. "రాజగోపాల్ అన్న .. తొందరపడకు , మాట జారకు!! 28 సార్లు నా పేరు చెప్పించినా.. 28 వేల సార్లు నా పేరు చెప్పించినా
అబద్ధం నిజం కాదు.." అంటూ కౌంటర్ ఇచ్చారు.
ఈ ట్వీట్‌కు రాజగోపాల్ రెడ్డి కూడా స్పందించారు. "నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కామ్‌లో ఉన్నది నిజం. జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కేటీఆర్, ఇంకా మీ టీఆర్ఎస్ నాయకులు పారదర్శకరంగా టెండర్ ద్వారా వచ్చిన 18000 కోట్ల కోల్ బ్లాక్ టెండర్ విషయంలో నా పై విష ప్రచారం చేసి.. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు రాబోయే రోజుల్లో అవినీతిమయమైన మీ కుటుంబం అంతా జైలుకి వెళ్లడం ఖాయం.." అని బదులిచ్చారు.
నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక @KTRTRS(#TwitterTillu) ఇంకా మీ తెరాస నాయకులు పారదర్శకరంగా టెండర్ ద్వారా వచ్చిన 18000 కోట్ల 1/2 https://t.co/xKfidkDslc
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) December 21, 2022
దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఎమ్మెల్సీ కవిత పేరు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జ్‌షీట్‌లోకి ఎక్కింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల్లో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్ మహేంద్రు కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం... సమీర్ మహేంద్రుతో కవిత ఫేస్‌టైమ్‌లో రెండు సార్లు, హైదరాబాద్‌లో ఒకసారి ప్రత్యక్షంగా కలిసినట్టు తెలుస్తోంది. ఇటీవలె ఇదే స్కామ్‌కు సంబంధించి సీబీఐ విచారణకు కవిత హాజరైన విషయం తెలిసిందే.
Also Read: 7th Pay Commission: 18 నెలల పెండింగ్ డీఏపై కేంద్రం కీలక ప్రకటన.. రాజ్యసభలో ఏం చెప్పిందంటే..
Also Read: CM Jagan: సీఎం జగన్ బర్త్ డే స్పెషల్.. విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి