Monsoon into Telugu States: రాగల 48 గంటల్లో నైరుతి రుతు పవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. ఇవాళ (జూన్ 11) మధ్య అరేబియాలోని కొన్ని ప్రాంతాలు, కొంకణ్‌లోని చాలావరకు ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. అలాగే, మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ నైరుతి రుతపవనాలు ప్రవేశించాయి. వచ్చే 48 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో రుతుపవనాలు ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత 2, 3 రోజులకు తెలంగాణలోని మరిన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని మరిన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి.
వడగాల్పులు, ఉరుములు మెరుపులతో వర్షాలు :
తెలంగాణలో నేటి నుంచి 6 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. శని, ఆదివారాల్లో (జూన్ 11, 12) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 30కి.మీ-40కి.మీ వేగంతో ఈదురు గాలులు వీయడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇవాళ పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు కింది స్థాయి గాలులు వీయనున్నట్లు తెలిపింది.
7 day forecast(mid day) of Telangana Based on 0300 UTC issued at 1300 Hours IST dated: 11/06/2022 pic.twitter.com/csY3uJEPUV
— IMD_Metcentrehyd (@metcentrehyd) June 11, 2022
Also Read: Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో వాళ్లకే టికెట్లు... రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
Also Read : KCR NEW PARTY: కేసీఆర్ జాతీయ పార్టీ వెనుక జగన్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి