MP Bandi Sanjay: అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

MP Bandi Sanjay Comments: తనకు రాజకీయాలకంటే ధర్మమే ముఖ్యమని బండి సంజయ్ స్పష్టం చేశారు. హిందూ ధర్మం కోసం తాను రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. తనను, రాజాసింగ్ లాంటి వాళ్లను గెలిపించకపోతే హిందూ ధర్మం గురించి మాట్లాడే వారుండని అన్నారు.  

Last Updated : Nov 17, 2023, 07:58 PM IST
MP Bandi Sanjay: అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

MP Bandi Sanjay Comments: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు రాజకీయాలకంటే ధర్మమే ముఖ్యం. హిందూ ధర్మం కోసం అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకునేందుకు కూడా వెనుకాడనని స్పష్టం చేశారు. ‘‘హిందూ ధర్మ రక్షణ కోసం, ప్రజల కోసం నా జీవితాన్నే ధారపోసిన. ధర్మం కోసం కొట్లాడిన నేను ఏనాడూ చావుకు భయపడలే.. చావే నన్ను చూసి భయపడింది. అయినా ఏనాడూ బాధపడలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలాంటోడు, రాజాసింగ్ లాంటి వాళ్లను గెలిపించకపోతే.. ఇకపై ఎవరూ హిందూ ధర్మం గురించి మాట్లాడే వారుండరు. ప్రజలంతా ముఖ్యంగా యువకులంతా గుర్తుంచుకోవాలి’’ అని చెప్పారు.

కరీంనగర్‌లోని వివిధ డివిజన్లకు చెందిన 500 మంది యువకులు ఈరోజు  సాయంత్రం బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అరుణ్ శివాలయం ఆధ్వర్యంలో ఎంపీ కార్యాలయానికి వచ్చిన వీరందరికీ కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. "ఇయాళ కేసీఆర్ వచ్చి ఏమన్నడు.. నాకు మత పిచ్చి ఉందట.. మరి నీకేం పిచ్చి..? మందు పిచ్చి.. నువ్వు మతపిచ్చి అన్నా.. మతతత్వవాది అన్నా.. నేను వెనుకడగు వేయను. బరాబర్ హిందూ ధర్మం గురించి మాట్లాడుతూనే ఉంటా.. నిజమైన నిఖార్సైన భయంకరమైన హిందువును నేనేనని చెప్పుకున్న కేసీఆర్‌కు పాతబస్తీకి పోవాలంటే అన్నీ తడుస్తయ్. ఎందుకంటే అక్కడికి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ కావాలట.. మరి నేను సవాల్ చేసి పాతబస్తీపోయి సభపెట్టి కాషాయ జెండా సత్తా చాటిన.

కేసీఆర్ అధికారంలోకి రాకపోతే నమాజ్ చేసే అవకాశం ఉండదని చెబుతున్నడు కేటీఆర్.. మరి ట్విట్టర్ టిల్లు.. గుడి గురించి ఎందుకు మాట్లాడరు..? గణేష్ ఉత్సవాలకు పర్మిషన్ తీసుకోవాలి..? దసరా ఉత్సవాలకు పర్మిషన్ తీసుకోవాలి.. నాకు రాజకీయాలకంటే ధర్మమే ముఖ్యం. హిందూ ధర్మం కోసం అవసరమైతే రాజకీయాలను కూడా వదులుకుంటా.. ఇప్పుడున్న కమలాకర్‌కు హిందూ ధర్మం గురించి తెలుసా..? 12 మంది ఎంఐఎం కార్పొరేటర్లు గెలిస్తే కరీంనగర్‌ను నాశనం చేశారు. ఇండియా గెలిస్తే నల్లజెండాలు ఎగరేశారు. అట్లాంటి ఎంఐఎం లుచ్చా నా కొడుకులను తరిమికొట్టకుండా ఊరుకోవాలా..? ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎంఐఎంకు గంగుల కమలాకర్ మేయర్ పదవిస్తాడట.. అదే జరిగితే  రేపటి నుంచి ఎవరూ అయ్యప్ప, భవానీ మాల వేసుకునే అవకాశముండదు. బొట్టు పెట్టుకుని కంకణం కట్టుకునే పరిస్థితి ఉండదని గుర్తుంచుకోండి..

ఎంఐఎం, బీఆర్ఎస్ ఆగడాలను అడ్డుకునేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణలోని హిందుత్వవాదులంతా వచ్చి పనిచేశారు. 4 సీట్ల నుంచి 48 సీట్లను గెలిపించారు. టైమ్ పాస్ పాలిటిక్స్ వద్దు.. సీరియస్‌గా తీసుకోవాలి. ఎన్నికలప్పుడే హిందుత్వం మాట్లాడాలే.. ఆ తరువాత వదిలేయాలనే భావనను రాజకీయ నాయకులు విడనాడాలి. నాపై 74 కేసులు పెట్టారు. నేనేమైనా గంగుల కమలాకర్, పురమళ్ల శ్రీనివాస్ లెక్క భూకబ్జాలు చేశానా..? ఆస్తి గొడవలున్నాయా..? లేక నా కుటుంబ గొడవలున్నాయా..? ప్రజల కోసం పోరాడిన.. ఉద్యోగుల పక్షాన కొట్లాడితే నా ఆఫీస్‌ను ధ్వంసం చేసి నన్ను జైలుకు పోయిన. 

నేను మీ కోసం జీవితాన్ని ధారపోసిన. అయినా ఏనాడూ బాధపడలేదు. కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో నాలాంటి వాడు, రాజాసింగ్ లాంటి వాళ్లు గెలవకపోతే.. రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటే ఇకపై ధర్మం గురించి మాట్లాడేదెవరు..? ధర్మం కోసం కొట్లాడేవారెవరున్నారు..? ధర్మం కోసం కొట్లాడిన నేను ఏనాడూ చావుకు భయపడలే.. చావే నన్ను చూసి భయపడింది. కాషాయపు జెండా మాత్రమే ఎగరాలనుకుంటున్నా.. ఎంఐఎం వచ్చి పాలిస్తానంటే ఊరుకునే ప్రసక్తే లేదు.." అని బండి సంజయ్ అన్నారు.

Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News