Night Curfew: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, నేటి రాత్రి నుంచి నెలాఖరు వరకు కొనసాగింపు

Telangana Night Curfew| కరోనా కేసులు, మరణాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 20 రాత్రి 9 గంటల నుంచి ఏప్రిల్ 30 వరకు నైట్ కర్ఫ్యూ విధించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 20, 2021, 01:05 PM IST
Night Curfew: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, నేటి రాత్రి నుంచి నెలాఖరు వరకు కొనసాగింపు

Telangana Night Curfew : తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి (ఏప్రిల్ 20) నుంచి ఏప్రిల్ 30 వరకు నైట్ కర్ఫ్యూ విధించారు. నేటి రాత్రి 9 గంటల నుంచి మే 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, వాటి రిపోర్టులు సరిగా లేవని, ఏం చర్యలు తీసుకుంటున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ విధిస్తారా, నైట్ కర్ఫ్యూ విధిస్తారా, లేదా ఇతర ఏ చర్యలు తీసుకుంటారో చెప్పాలని తెలంగాణ సర్కారుకు సోమవారం నాడు 48 గంటల సమయం గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం నేటి రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ(Night Curfew In Telangana) అమలు కానుందని తెలిపింది. గాలి ద్వారా గతంలో కన్నా పదిరెట్లు వేగంగా కరోనా వ్యాప్తి చెందడంతో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Also Read: Covid-19 Positive Cases: తెలంగాణలో ఒక్కరోజులో 18 కరోనా మరణాలు, 6 వేల చేరువలో కేసులు

తెలంగాణలో తాజాగా 5,926 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,359కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది. కరోనా బారిన పడి రాష్ట్రంలో మరో 18 మంది మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,856కి చేరింది. 

బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లకు రాత్రి 8 గంటల వరకు అనుమతి ఇచ్చారు. అంతర్ రాష్ట్ర రవాణా సర్వీసులపై ఎలాంటి ఆంక్షలు లేవు. రాత్రి కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు కల్పించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఐటీ సర్వీసులకు, పెట్రోల్ బంకులు ఈ-కామర్స్ సర్వీసులకు అనుమతి ఇస్తూ తెలంగాణ సర్కార్ నైట్ కర్ఫ్యూ విధించింది.

Also Read: Corona Cases: భారత్‌కు ప్రయాణాలు చేయవద్దని పౌరులను హెచ్చరించిన అమెరికా ప్రభుత్వం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News