Koneru Konappa: దిగివచ్చిన రేవంత్‌ రెడ్డి.. బుజ్జగింపులతో కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ చేరిన కోనేరు కోనప్ప

Ex MLA Koneru Konappa One Day Resign Again Joins Into Congress: పార్టీలో జరుగుతున్న అసంతృప్తితో రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రాజీనామా చేసిన తెల్లారి మళ్లీ చేరిపోవడం విస్మయంగా ఉంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 22, 2025, 02:28 PM IST
Koneru Konappa: దిగివచ్చిన రేవంత్‌ రెడ్డి.. బుజ్జగింపులతో కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ చేరిన కోనేరు కోనప్ప

Telangana Congress Party: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పాలనలో పూర్తిగా విఫలమవడం.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసంతృప్తితో సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం కలకలం రేపింది. స్థానిక ఎన్నికల ముందు భారీ ఎదురుదెబ్బ అని గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. దీంతో అతడిని బతిమిలాడి బామాలి ఎట్టకేలకు మళ్లీ పార్టీలోకి చేర్చుకున్నారు. లేదు లేదు ఆయన రాజీనామా చేయలేదని తిరిగి కండువా కప్పి చెప్పించే ప్రయత్నం చేశారు. ఈ పరిణామం తెలంగాణలో ఆసక్తికరంగా ారింది. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన తెల్లారే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మళ్లీ చేరిపోయారు.

Also Read: Koneru Konappa: రేవంత్‌ రెడ్డికి ఊహించని దెబ్బ.. కాంగ్రెస్‌ పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న కోనప్ప కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఏడాది కాకుండానే అక్కడ ఇమడలేకపోతున్నారు. అధికారం ఉన్నా కూడా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో అభివృద్ధి పనులు చేపట్టకపోవడం.. మంజూరైన ఫ్లైఓవర్‌ను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రద్దు చేశాడు. ఈ పరిణామాలతో ఆయన అలిగి శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.

Also Read: Govt Holiday: విద్యార్థులు, ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై ప్రతి నెల నాలుగో శనివారం సెలవు

అతడి రాజీనామాతో కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. స్థానిక ఎన్నికల ముంగిట ఈ పరిణామం భారీ దెబ్బ తీస్తుందని భావించిన పార్టీ అధిష్టానం వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అతడిని శుక్రవారం, శనివారం బుజ్జగింపులు చేశారు. ఆయన డిమాండ్లకు అంగీకరించడంతో తిరిగి కోనప్ప కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రేవంత్‌ రెడ్డి నివాసంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్, కుసుమ్ కుమార్, మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కనిపించారు.  ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి కోనప్ప వినతిపత్రం ఇచ్చారు. కోనప్ప రాజీనామాకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా రూ.75 కోట్లతో మంజూరు చేయించిన ఫ్లైఓవర్‌ను రద్దు చేయడం కారణంగా తెలుస్తోంది.

కోనప్ప నేపథ్యం
2024 ఎన్నికల్లో బీఎస్సీ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోనప్ప బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలవగా.. 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ ఎన్నికల సమయంలో తనపై పోటీ చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడంతో అసంతృప్తితో గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News