Ramreddy Damodar Reddy: పార్టీ మార్పు వార్తలపై స్పందించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి

Ramreddy Damodar Reddy Party Changing News: సూర్యాపేట నుంచి తాను పోటీచేసే విషయంలో లోకల్ - నాన్ లోకల్ అని కొంతమంది రాజకీయం చేస్తున్నారు అంటూ ఆ విషయాన్ని ప్రస్తావించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి.. 40 సంవత్సరాలుగా సూర్యాపేట కేంద్రంగా రాజకీయాల్లో ఉన్నాను అనే విషయాన్ని పార్టీ మిత్రులు గమనించాలి అని అన్నారు.

Written by - Pavan | Last Updated : Aug 1, 2023, 09:21 AM IST
Ramreddy Damodar Reddy: పార్టీ మార్పు వార్తలపై స్పందించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి

Ramreddy Damodar Reddy Party Changing News: తెలంగాణ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్టీ మారుతున్నారని.. ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం అవుతోందంటూ వస్తోన్న వార్తలపై స్వయంగా ఆయనే స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఉత్తి ఊహాగానాలు, పుకార్లుగానే కొట్టిపారేసిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి.. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, ఇంకొంత మంది సొంత పార్టీ నేతలే పనికట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గత 4 తరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ వస్తోన్న తన లాంటి వ్యక్తిపై ఇలా దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తంచేశారు. 

తాను పార్టీ మారుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన దామోదర్ రెడ్డి.. దయచేసి ప్రజలు , కార్యకర్తలు ఎవ్వరూ ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దు అని విజ్ఞప్తి చేశారు. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వరూ తనని సంప్రదించలేదని.. అలాగే తన లాంటి నాయకుడిని పార్టీ మారమని అడిగే దమ్ము కూడా ఎవ్వరికీ లేదు అని మండిపడ్డారు. రాజకీయంగా తను కాంగ్రెస్ పార్టీలోనే పుట్టానని.. చివరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు. 

సూర్యాపేట టిక్కెట్ నాదే.. విజయం నాదే.. 
మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్యాపేట నుంచే వచ్చే ఎన్నికల బరిలో దిగబోతున్నట్టు దామోదర్ రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై సూర్యాపేట నుండే పోటీ చేయబోతున్నాను అని తేల్చిచెప్పిన జగదీశ్వర్ రెడ్డి.. సూర్యాపేట నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ తనదే.. అలాగే గెలుపు కూడా తనదేనని.. ఇందులో ఎలాంటి అనుమానంలేదని బల్లగుద్ది మరీ చెప్పారు. ఈ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అయోమయం అక్కర్లేదని అన్నారు. 

లోకల్ - నాన్ లోకల్ లేనే లేదు
సూర్యాపేట నుంచి తాను పోటీచేసే విషయంలో లోకల్ - నాన్ లోకల్ అని కొంతమంది రాజకీయం చేస్తున్నారు అంటూ ఆ విషయాన్ని ప్రస్తావించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి.. 40 సంవత్సరాలుగా సూర్యాపేట కేంద్రంగా రాజకీయాల్లో ఉన్నాను అనే విషయాన్ని పార్టీ మిత్రులు గమనించాలి అని అన్నారు. ఎవ్వరూ పార్టీలో లేని రోజుల్లోనే తానొక్కడినే ఇక్కడ నుండి గెలిచానని.. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేశానని పేర్కొన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన సందర్భంలోనూ ఇతర పార్టీల నుంచి ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ.. తాను మాత్రం పార్టీ మారకుండా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకే వచ్చానని గుర్తుచేసుకున్నారు.

చంద్రబాబు, కేసీఆర్ కూడా అడిగారు...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు.. తనని టీడీపీలోకి రావాల్సిందిగా చంద్రబాబు నాయుడు, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సమయంలో తనని ఆ పార్టీలోకి రమ్మని కేసీఆర్ అడిగినప్పటికీ వెళ్ళలేదన్నారు. ఇప్పడు కావలసింది ప్రతిపక్ష నాయకుల పార్టీ మార్పుపై దృష్టి పెట్టడం కాదని.. భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలకి , రైతులకు చేయూతను అందించడమే లక్ష్యంగా పని చేయాలని కోరుతూ అధికార పార్టీకి చురకలంటించారు. తనకు సెపరేటుగా ఏ గ్రూపులు లేవని.. తనది కాంగ్రెస్ పార్టీ గ్రూపు.. సోనియా గాంధీ గ్రూపు అని స్పష్టంచేసిన దామోదర్ రెడ్డి.. ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. 

ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో ఐటి శాఖ మంత్రిగా సేవలు అందించారు. 2009 లో సుర్యాపేట నుంచి పోటీ చేసి వేదాస్ వెంకయ్యపై విజయం సాధించారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా ముందు అక్కడి నుంచి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అందుకే ప్రస్తుతం మరోసారి అదే స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 

ఇది కూడా చదవండి : SEJAL Sensational Comments on BRS Leaders: బీఆర్ఎస్ నేతల దుమ్ము దులిపిన శేజల్

రాంరెడ్డి దామోదర్ రెడ్డి సోదరుడు రాంరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఎమ్మెల్యేగా సేవలు అందించిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యేగా చేసిన రాంరెడ్డి వెంకట్ రెడ్డి 2016 లో అనారోగ్యంతో మృతి చెందారు. అంతకంటే ముందుగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించిన రాంరెడ్డి వెంకట్ రెడ్డి 2010 నుండి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగాను కొనసాగిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి : Uttam Kumar Reddy: బీఆర్ఎస్‌లో చేరికపై ప్రచారం.. బాంబ్ పేల్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇది ఆయన పనే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News