Revanth Reddy Master Plan: అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి కోలుకోకముందే లోక్‌సభ ఎన్నికల రూపంలో బీజేపీకి గడ్డు కాలం ఎదురైంది. అత్యధి స్థానాలు గెలిచి సత్తా చాటాలని చూస్తున్న కాషాయ పార్టీకి పరిస్థితులు సహకరించడం లేదు. ఇన్నాళ్లు బీఆర్‌ఎస్ పార్టీపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీపై దృష్టి పెట్టింది. అధికారం చేపట్టినప్పటి నుంచి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు బీజేపీ నాయకులపై వల విసురుతున్నారు. దీంతో రేవంత్ దెబ్బకు బీజేపీ నుంచి పది మంది ఎమ్మెల్యే అభ్యర్థులు జంప్ అయ్యారు.
Also Read: Revanth Reddy: 'కవిత బెయిల్ కోసం మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం': రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తూ పార్టీని వీడుతున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థులు పార్టీకి బై బై చెబుతున్నారు. ఇప్పటికే పదిమంది పార్టీకి బైబై చెప్పేశారు. త్వరలోనే మరికొందరు కూడా పార్టీ మారనున్నారని ప్రచారం జరుగుతోంది.
Also Read: Wine Shops Close: తెలంగాణలో వైన్స్ దుకాణాలు బంద్.. ఇక్కడే ఒక మెలిక ఏమిటంటే?
పార్టీని వీడిన వారిలో శ్రీగణేశ్ (కంటోన్మెంట్), కూన శ్రీశైలం గౌడ్, పులిమామిడి రాజు, ఆరెపల్లి మోహన్, రవీంద్ర నాయక్, చలమల కృష్ణారెడ్డి (మునుగోడు), రతన్ పాండురంగారెడ్డి (నారాయణపేట), జలంధర్‌రెడ్డి (మక్తల్), మిథున్‌రెడ్డి (మహబూబ్‌నగర్) ఉన్నారు. పార్టీలో కీలకంగా వ్యవహరించిన మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కూడా పార్టీ మారారు. ఇలా కాషాయ పార్టీలో కీలక నాయకులైన వారికి రేవంత్ గాలం వేస్తున్నారు. అధికార పార్టీ నుంచి ఆహ్వానం వస్తుండడంతో బీజేపీ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు వరుస కడుతున్నారు. కాంట్రాక్ట్‌లు, పదవుల ఆశతో లీడర్లు పార్టీ మారుతున్నారు.
పాలమూరుపై రేవంత్ దృష్టి
తన సొంత జిల్లా పాలమూరుపై రేవంత్ రెడ్డి పూర్తి దృష్టి సారించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ స్థానాల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో రేవంత్ ఉన్నారు. దీంతో పాలమూరు జిల్లా బీజేపీ దెబ్బకొట్టే ప్రణాళికను రేవంత్ అమలు చేస్తున్నారు. దీనికితోడు తన ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న డీకే అరుణను ఒంటరి చేయాలని భావిస్తున్నాడు. నారాయణపేట జన జాతర సభలో కూడా అరుణను లక్ష్యంగా చేసుకుని రేవంత్ విమర్శించిన విషయం తెలిసిందే. ఇలా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీని దెబ్బతీసి లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సొంతం చేసుకోవాలని రేవంత్ రెడ్డి వ్యూహం అమలు చేస్తున్నారు. మరి రేవంత్ లక్ష్యం ఫలిస్తుందా? అనేది కొన్ని వారాలు వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter