Telangana Cabinet Expansionn: దాదాపు దశాబ్దపు ఎదురు చూపుల తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడి ప్రజలు అధికారం కట్టబెట్టారు. అయితే యేడాది పూర్తి కావొస్తోన్న ఇప్పటికే తెలంగాణలో పూర్తి స్థాయి క్యాబినేట్ విస్తరణ జరగలేదు. లోక్ సభ ఎన్నికల తర్వాత విస్తరణ ఉంటుందిని ఆశించారు. కానీ లోక్ సభ ఎన్నికలు జరిగి దాదాపు 7 నెలలు కావొస్తోన్న ఇప్పటికీ దీనిపై క్లారిటీ లేదు. తెలంగాణలో క్యాబినేట్ విస్తరణ కోసం కొంత మంది ఆశావహులు ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే..సంక్రాంతి పండగ, రేవంత్ విదేశీ పర్యటనల నేపథ్యంలో ఆలస్యమవువుతూ వచ్చింది. తాజాగా తెలంగాణ కేబినేట్ విస్తరణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల తర్వాత విస్తరణ చేపట్టే అవకాశాలున్నాయి.
ఈ క్రమంలోనే అధిష్ఠానంతో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో మంత్రివర్గ విస్తరణ అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్, చంద్రబాబు మాదిరే వేరే పార్టీల వారినీ తన పార్టీలో చేర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. కొత్తగా జరిగే మంత్రివర్గ విస్తరణలో మరో ఆరుగురికి మాత్రమే ఛాన్స్ ఉంది. అటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ను మంత్రి పదవి దక్కడం గ్యారంటీ అని చెబుతున్నారు.మరోవైపు మక్తల్ శాసనసభ్యుడైన వాకిటి శ్రీహరిని మంత్రి వర్గంలో తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ సారి మంత్రివర్గంలో తీసుకుంటారా అనేది చూడాలి. అటు హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ కు ఛాన్స్ దక్కనున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఆల్రెడీ రెడ్డిలతో పాటు కోమటిరెడ్డి అన్న కూడా మంత్రిగా ఉండటంతో ఈయనకు ఆమాత్య పదవి దక్కడం డౌటే అని చెబుతున్నారు. తెలంగాణలో మొత్తంగా 18 మందికి ముఖ్యమంత్రితో కలిసి మంత్రి పదువులు ఇవ్చొచ్చు. ఇప్పటికే క్యాబినేట్ లో ముఖ్యమంత్రితో కలిపి దాదాపు 4 రెడ్లకు స్థానం దక్కింది. ఇప్పటికే రేవంత్ తో కలిపితే 12 మంది ఉన్నారు. ఈ సారి విస్తరణలో 4 నలుగురికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. మరో 2 తర్వాత భర్తీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
మరోవైపు ముస్లిమ్ కు మేమే అండ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో ముస్లిమ్ మైనారిటీ వర్గం నుంచి ఒక్కరు కూడా మంత్రులుగా ఈ సారి మంత్రివర్గంలో మైనారిటీ వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. సామాజిక వర్గాలుగా చూసుకుంటే.ఈ సారి మంత్రివర్గంలో మైనారిటీ, ఎస్సీ ల నుంచి మాల, మరో రెడ్డితో పాటు ఒక బీసీలకు దక్కే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.