Bhagyalaxmi Temple Row: ఆలయాన్ని ముట్టుకుంటే చేయి నరికేస్తా..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Bhagyalaxmi Temple Row: మొన్న జ్ఞానవాపి, నిన్న మధుర..నేడు చార్మినార్ వర్సెస్ భాగ్యలక్ష్మి ఆలయం. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 2, 2022, 07:20 PM IST
  • చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వివాదం, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
  • భాగ్యలక్ష్మి ఆలయాన్ని ముట్టుకుంటే చేయి నరికేస్తానంటూ హెచ్చరిక
  • చార్మినార్ కూల్చేయాలని తామెప్పుడూ డిమాండ్ చేయలేదంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు
Bhagyalaxmi Temple Row: ఆలయాన్ని ముట్టుకుంటే చేయి నరికేస్తా..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Bhagyalaxmi Temple Row: మొన్న జ్ఞానవాపి, నిన్న మధుర..నేడు చార్మినార్ వర్సెస్ భాగ్యలక్ష్మి ఆలయం. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

భాగ్యలక్ష్మి ఆలయాన్ని ముట్టుకుంటే చేయి నరికేస్తానంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. చార్మినార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భాగ్యలక్ష్మి ఆలయం సమీపంలో చార్మినార్ వద్ద నమాజు చేసుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ..కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ సంతకాలు సేకరణపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రషీద్ ఖాన్‌పై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. మసీదు వద్ద మేం సంతకాలు తీసుకోవాలా అని ప్రశ్నించారు. 

అదే సమయంలో చార్మినార్ పూర్తిగా శిధిలావస్థకు చేరుకుందని..పెద్ద పెద్ద వాహనాలు వెళితే కూలిపోయే స్థితికి చేరుకుందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. రషీద్ ఖాన్ మసీదుకు వెళ్లి నమాజు చేసుకోవాలని సూచించారు. చార్మినార్ వద్ద సంతకాలు సేకరిస్తుంటే..పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కూడా ఈ విషయంపై మండిపడ్డారు. భాగ్యలక్ష్మి ఆలయం తమకెంతో పవిత్రమైందని..కొందరు కూల్చేయాలని చూస్తున్నారని స్పష్టం చేశారు. చార్మినార్ కూల్చేయాలని తామెప్పుడూ డిమాండ్ చేయలేదని..ఓల్డ్ సిటీలో ముస్లింలు అభివృద్ధి కోరుకుంటుంటే..మజ్లిస్ పార్టీ ఆస్థులు కూడబెట్టుకుంటోందని బండి సంజయ్ విమర్శించారు. ముస్లింలను ఆ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగా పరిగణిస్తోందన్నారు. 

చార్మినార్ వద్ద నమాజుకు అనుమతి కోరుతూ కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ సంతకాల సేకరణ చేయడమే ఈ వివాదానికి కారణంగా మారింది. భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు జరుగుతున్నప్పుడు..చార్మినార్ వద్ద నమాజుకు ఎందుకు అనుమతివ్వరని రషీద్ ఖాన్ ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తానన్నారు. 

Also read: Telangana: భారీ స్థాయిలో న్యాయ వికేంద్రీకరణ..దేశంలోనే ఇది తొలిసారి, తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీజేఐ ప్రశంసలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News