Agnipath Row : రాకేష్ మృతికి నిరసనగా టీఆర్ఎస్ బంద్.. మోడీ దుర్మార్గం వల్లే చనిపోయాడని కేసీఆర్ ఫైర్

Agnipath Row: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంస కాండపై రాజకీయ రచ్చ ముదురుతోంది. కేంద్ర సర్కార్ విధానాల వల్లే యువకులు ఆందోళనకు దిగారని, ఓ యువకుడు బలయ్యాడని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ మాత్రం అల్లర్ల వెనుక కుట్ర ఉందని చెబుతోంది.

Written by - Srisailam | Last Updated : Jun 18, 2022, 07:00 AM IST
  • దబీర్ పేటలో ఇవాళ రాకేష్ అంత్యక్రియలు
  • నర్సంపేట బంద్ కు టీఆర్ఎస్ పిలుపు
  • మోడీ దుర్మార్గానికి రాకేష్ బలి- కేసీఆర్
Agnipath Row : రాకేష్ మృతికి నిరసనగా టీఆర్ఎస్ బంద్.. మోడీ దుర్మార్గం వల్లే చనిపోయాడని కేసీఆర్ ఫైర్

Agnipath Row : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంస కాండపై రాజకీయ రచ్చ ముదురుతోంది. కేంద్ర సర్కార్ విధానాల వల్లే యువకులు ఆందోళనకు దిగారని, ఓ యువకుడు బలయ్యాడని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ మాత్రం అల్లర్ల వెనుక కుట్ర ఉందని చెబుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కాల్పుల్లో చనిపోయిన రాకేష్ డెడ్ బాడీని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో ఉంచారు. రాత్రి హైదరాబాద్ నుంచి భద్రత మధ్య రాకేష్ మృతదేహాన్ని వరంగల్ తీసుకొచ్చారు. మృతుడి స్వస్థలం నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం దబీర్ పేటకు తరలిస్తారు. రాకేష్ అంత్యక్రియలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

ఎంజీఎంలో ఉన్న రాకేష్ మృతదేహాన్నిసందర్శించి నివాళులు అర్పించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇండ్ల నాగేశ్వర్ రావు సహా పలువురు టీఆర్ఎస్ నేతలు నేతలు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రాకేష్ మృతి విషయం తెలిసిన వెంటనే దబీర్ పేటకు వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేంద్ర సర్కార్ ఆనాలోచిత నిర్ణయాలతో యువతి యువకులు ఆందోళనకు దిగారని చెప్పారు. రాకేష్ మృతికి నిరసనగా నర్సంపేట నియోజకవర్గ బంద్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపిచ్చారు. ఎమ్మెల్యే పిలుపుతో నియోజకవర్గ బంద్ నిర్వహిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.

పోలీసు కాల్పుల్లో రాకేష్ చనిపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని కేసీఆర్ చెప్పారు. కేంద్ర సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు గులాబీ బాస్. మోడీ ప్రభుత్వ అనాలోచిత, తప్పుడు, దుర్మార్గ విధానాలకు రాకేష్ బలయ్యారని అన్నారు. కాల్పుల్లో బీసీ బిడ్డ బలి కావడం తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాకేశ్ కుటుంబానికి  25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. అతని కుటుంబంలో అర్హులైన వారికి అర్హత మేరకు ప్రభఉత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో గాయపడ్డవారికి గాంధీ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Read also: Agnipath scheme: వాట్సాప్ గ్రూప్స్‌లోనే సికింద్రాబాద్ అల్లర్లకు ప్లాన్ ? కాల్పుల ఘటనపై పాయింట్ టు పాయింట్ పోలీస్ రిపోర్ట్

Read also: 10,105 Govt Jobs: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. 10,105 ఖాళీల భర్తీకి ఆదేశాలు జారీ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News