cm revanth reddy orders 24 hours shops open for Ramazan festival: రంజాన్ పండగ వేళ సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మరొవైపు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్ పండగ నెల రోజుల పాటు.. ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం 4 గంటలకే తమ విధుల నుంచి రిలీవ్ అయ్యేలా ఇప్పటికే సీఎస్ శాంతికుమారీ ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం దీనిపై ఉద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
మార్చి 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 24 గంటల పాటు షాపులు తెరుచుకోవచ్చని తెలంగాణ కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది గంటలు లేదా వారానికి 48 గంటల కంటే ఎక్కువ పనిచేసే ఉద్యోగులకు జీతాలు రెండింతలు ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది.
అదే విధంగా మహిళ ఉద్యోగులు ఉంటే.. వారికి ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకొవాలన్నారు. అదే విధంగా.. జీవో 476ను తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రంజాన్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ అలీ, ముస్లిం సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. రంజాన్ కు ముందుగానే ఈ రకంగా ఉత్తర్వులు ఇవ్వడం ఆశాజనకంగా ఉందన్నారు.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఉద్యోగులకు ఇచ్చిన వెసులుబాటుపై దుమారం చెలరేగింది. సీఎం రేవంత్ హిందు పండగలను ఒకలా.. ముస్లింపండగను మరోలా చూస్తున్నారన్నారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. రామ్ నవమి, హనుమాన్ జయంతి వేళ.. తమను మాత్రం కట్టడి చేస్తున్నారని.. అప్పుడు ఇవన్ని గుర్తుకు రావడంలేదా.. అంటూ కాంగ్రెస్ పై మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి